అతనికి 30.. నాకు 43.. ప్రేమించుకుంటే తప్పేంటి అంటున్న షకీలా..!!

0
234

సినీ ఇండస్ట్రీలో శృంగార తారగా ఎనలేని కీర్తిప్రతిష్టలతో ప్రేక్షక లోకాన్ని తనదైన శైలిలో అలరించింది, ఆమెనే షకీలా. షకీలా సినిమాల్లో ఎంత బోల్డ్ నెస్ ఉంటుందో ఆమె వ్యక్తిగత జీవితంలోనూ అంతకన్నా బోల్డ్ సంఘటనలు ఉన్నాయి. ఎంతోమందిని ఆమె ప్రేమించింది, ఇక అంతకు మించి మరెంతోమంది ఆమెను ప్రేమించారు, కానీ షకీలాను అర్థం చేసుకునే మగాడు ఆమెకు దొరకలేదు.

అందుకే, ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా తనకు నచ్చే అతని కోసం కలలు కంటూ ఎదురుచూస్తూ ఉంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన షకీలా తన ప్రేమ గురించి మళ్ళీ ఒక షాకింగ్ విషయం చెప్పింది. షకీలా ప్రస్తుతం ఒకరితో ప్రేమలో ఉందట. షకీలా మాటల్లోనే ‘అవును, ప్రస్తుతం నేను ఒకతనితో ప్రేమలో ఉన్నాను. తనకి కూడా నేనంటే ఎంతో ప్రేమ, నా పై చాలా ఇష్టం చూపిస్తాడు అని పరవశించిపోతూ.. ‘నిజంగా ప్రేమ అంటే ప్రేమ అంతే. ఇప్పటికే నాకు 43 ఏళ్లు దాటాయి.

అందుకే నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అయినా అతన్ని ప్రేమిస్తూనే ఉంటాను. ఈ వయసులో ప్రేమ ఏంటి అని ఈ సమాజం అనుకోవచ్చు. పైగా నా వయసు 43 అయితే, అతని వయసు కేవలం 30 మాత్రమే. నాకంటే అతను చిన్నవాడు. కానీ ఏజ్‌ అనేది జస్ట్‌ నెంబర్‌ మాత్రమే అని నేను నమ్ముతాను.ఇక అతనికి పెళ్లి కాలేదు.

ఒకవేళ నేను పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడి, అతని ఫ్యామిలీలో గొడవలకు కారణం అయితే అది నా తప్పు. పెళ్లి కానీ వ్యక్తిని ప్రేమిస్తే తప్పు ఎలా అవుతుంది ? అందుకే ఇద్దరం ప్రేమించుకుంటున్నాం’ అంటూ తనకు మాత్రమే సాధ్యమయ్యే బోల్డ్‌ కామెంట్స్‌ తో రెచ్చిపోయింది షకీలా. ఏది ఏమైనా షకీలా ఎవరితోనూ సీక్రెట్‌ రిలేషన్‌ పెట్టుకోదు. అంతా తెరిచిన పుస్తకమే. ఇప్పటివరకు ఆమె ఏడుగురితో రిలేషన్‌లో ఉందని..ఇతను ఎనిమిదవ వాడని స్వయంగా తెలిపింది శృంగార తార షకీలా..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here