టాలీవుడ్లో బ్యూటిఫుల్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న జంట నాగ చైతన్య, సమంత.. ఏమాయ చేసావే సినిమాతో పరిచయమైన సమంత తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి భారీ విజయాలను అందుకుంది. ఇక అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య కూడా ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. ఈ ఇద్దరు కలిసి నటించిన ఏమాయచేసావే సినిమా సమయంలోనే ప్రేమలో పడ్డారు.
కొంతకాలం ప్రేమాయణం నడిపిన తర్వాత వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరు సినిమాలను కంటిన్యూ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఇద్దరు కలిసి మజిలీ సినిమాలో నటించారు.శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సామ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది.
శేఖర్ కమ్మల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చైతన్య. ఈ సినిమా థాంక్యూ అనే ఇంటరెస్టింగ్ టైటిల్ తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ ఇద్దరి సంపాదన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సామ్ ఆస్తుల విలువ రూ .84 కోట్లు ఉంటుందని సమాచారం. అలాగే రెండు స్టార్టప్ లను కలిగి ఉంది. ఒకటి ఫ్యాషన్ లేబుల్ సాకి .. మరొకటి ఎకామ్ అనే ప్రీ-స్కూల్. వీటితో ఈ అమ్మడు రెండు చేతుల సంపాదిస్తుంది. సమంత రూ .76 లక్షల విలువైన విలాసవంతమైన బి.ఎమ్.డబ్ల్యూ కారును కలిగి ఉంది.
అంతే కాదు ఈ ముద్దుగుమ్మ ఒక్కొక్క సినిమాకు సుమారు 2 కోట్లవరకు తీసుకుంటుందని తెలుస్తుంది. మరో వైపు నాగచైతన్య కూడా బాగానే సంపాదిస్తున్నాడు. సినీ కెరీర్ లో ఆర్జించినది నికర విలువ 38 కోట్ల రూపాయలు. అంతే కాదు చైతూకి ఖరీదైన కార్లు, బంగ్లాలు ఉన్నాయి. నాగచైతన్యతో పోలిస్తే సంఖ్యా పరంగా ఎక్కువ సినిమాల్లో నటించిన సమంత రూ .84 కోట్ల సంపాదించారని తెలుస్తుంది. చైతన్య, సామ్ ఇద్దరి సంపద కలిపి మొత్తం రూ .122 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు సినీ పండితులు… !!
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…