టాలీవుడ్లో అగ్ర హీరోలకు సంబంధించిన ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ.. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రముఖ నటి సురేఖా వాణి. కేవలం సినిమాల్లో కనిపించడమే కాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ.. తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది. ఇటీవల సురేఖా… తన స్నేహితురాలు రజితతో కలిసి ప్రముఖ టాల్క్ షోలో పాల్గోంది.
అందులో తన రెండో పెళ్ళికి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు సురేఖా.ఇక బిగ్ స్క్రీన్ పై ఎప్పుడూ సంప్రదాయంగా కనిపించే సురేఖా.. సోషల్ మీడియాలో మాత్రం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలతోపాటు.. మోడ్రన్ లుక్కులో ఉండే ఫోటోలను షేర్ చేస్తూ..ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇటీవల సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్న సందర్భంగా సురేఖా కూడా రెండో పెళ్ళి చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఇక ఈ వార్తలపై గతంలోనే సురేఖా క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఓ టాల్క్ షోలో పాల్గోన్న ఆమె మరోసారి ఈ విషయాలపై స్పందించింది. తన కెరీర్ ప్రారంభమై 22 ఏళ్లు పైగా అవుతుందని పేర్కొన్న ఆమె సీటీ కేబుల్‌లో కెరీర్ స్టార్ట్ అయ్యిందని అక్కడ తన బాబాయ్ పని చేస్తూ ఉండడంతో ఆయన ప్రోద్బలంతో ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న ప్రోగ్రామ్స్, ఇంటర్వ్యూలు చేస్తూ ఇక్కడి దాకా వచ్చానని ఆమె చెప్పుకొచ్చింది.
అలాగే తన రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వార్తలు వచ్చేవరకు తనకు తెలియదని తాను ఎవరిని పెళ్ళి చేసుకుంటున్న అనే విషయం.. ఆయన ఎవరో తెలిస్తే చెప్పాలని కోరింది. ఒకవేళ సంబంధం చూస్తే.. కాస్తా డబ్బున్న వాళ్ళను చూడాలని తెలిపింది. దీంతో మనసున్న వాళ్ళు కావాలా? డబ్బున్న వాళ్ళు కావాలా? అని యాంకర్ అడగ్గా.. మనసుతో పనులు జరగవని అర్థమైపోయిందని, డబ్బున్న వాళ్ళయితే బెటర్ అని అంటోంది సురేఖా వాణి…!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…