Senior Actor Kakarala Sathyanarayana : నేను చెప్పిన వినలేదు.. చివరకు రోడ్డున పడ్డాడు…: సీనియర్ నటుడు కాకరల సత్యనారాయణ

Senior Actor Kakarala Sathyanarayana : నాటక రంగం నుండి సినిమా రంగానికి వచ్చిన నటులలో కాకరాల ఒకరు. సుమారు రెండుందలకు పైగా సినిమాల్లో నటించిన ఆయన దిగ్గజ నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటించారు. అలానే కామెడీ, విలనీజం రెండింటిని పండించిన ఆయన బి, ఎన్ రెడ్డి గారి రంగుల రాట్నం సినిమాకు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన మా భూమి వంటి సినిమాల్లో అలాగే చిరంజీవి గారి సినిమాల్లో తొలినాళ్ళలో నటించారు. అలనాటి సినిమా విశేషాలను తాజాగా ఓక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.

రాజబాబు మంచి స్నేహితుడు…

కాకరల గారు డాక్టర్ రాజారావు గారి శిష్యులు . ఆయన నాటకాల ద్వారానే సినిమా ఇండస్ట్రీ లోకి పరిచయం అయినా ఆయన రాజారావు గారి వద్ద ఎక్కువగా ఉండేవారు. ఇక రాజబాబు, అల్లు రామలింగయ్య వంటి వారు రాజారావు గారి వద్ద ఉండేవారట అల్లు రామలింగయ్య గారు రాజారావు గారికి స్నేహితులు. ఇక రాజబాబు, నేను మంచి స్నేహితులం. రాజబాబు కమెడియన్ గా స్టార్ గా ఎదిగినపుడు మా స్నేహం ఉంది. అలాగే చివరికి అన్ని కోల్పోయిన సమయంలోను మా స్నేహం ఉంది అంటూ కాకరల తెలిపారు.

రాజబాబు ది చాలా జాలి గుండె సహాయం ఎక్కువ చేసేవాడు. అలాగే ఎవరి వల్లయినా బాధపడితే తట్టుకునే వాడు కూడా కాదు అంటూ చెప్పారు. ఇక సినిమా నిర్మాణం లో అడుగుపెట్టి మనిషి రోడ్డున పడ్డాడు అనే సినిమా తీయాలనీ అనుకున్నపుడు నా వద్ద చర్చకు వస్తే మనిషి దారిన పడ్డాడు అని తీయి బాగుంటుంది రోడ్డున పడ్డాడు అని వద్దని చెప్పిన వినలేదు. పక్కనే ఉన్నాం చెప్పిన వినలేదు సినిమాతో అతనే రోడ్డున పడ్డాడు. అయితే ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగానే ఎదుర్కొన్నాడని నేను అనుకుంటాను అంటూ కాకరల తెలిపారు.