Senior child artist Baby Rani : ఎన్టీఆర్ మా మావయ్య… వాళ్ళందరివీ మిస్టరీ మరణాలు…: సీనియర్ బాల నటి బేబీ రాణి

Senior child artist Baby Rani : తెలుగులో బంగారు తిమ్మరాజు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన బేబీ రాణి గారు శోభన్ బాబు గారి బంగారు పంజరం, బలి పీఠం వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. రాణి రుద్రమ దేవిగా సినిమా ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన బేబీ రాణి గా బాగా పేరు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులు కూడా బేబీ రాణి అనగానే అలనాటి ఆ నటిని గుర్తుపడతారు. ఎన్నో సినిమాల్లో చిన్నారిగా అలరించిన ఆమె తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ వంటి పలు భాషలలో నటించారు. ఆమె ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగ ఉన్నా తన కెరీర్ అలాగే తాను నటించిన పలువురు హీరోల గురించి తెలిపారు.

ఎన్టీఆర్ ను మావయ్య అంటాను… వాళ్ళ మరణాలను తట్టుకోలేక పోయాను…

ఎన్టీఆర్ గారి సినిమాల్లో నటించిన బేబీ రాణి గారు అయనను మావయ్య అనే పిలిచే అలవాటు ఉందట. తన పదవ ఏట వరకు సినిమాల్లో నటించిన ఆమె ఆపైన నటనకు గుడ్ బై చెప్పేసారు. ఇక సినిమా ఇండస్ట్రీకి దూరమై పెళ్లి చేసుకున్న చాలా ఏళ్లకు ఎన్టీఆర్ గారు సీఎం అయ్యాక ఆయన వద్దకు వెళ్లారట. తన భర్తను ఒకసారి మావయ్యను చుడాలని ఉంది అని అడిగితే తీసుకెళ్లారట. అలా వెళ్లగా సీఎంగా ఉన్న ఆయన మూడు నెలల పసికందుతో వెళ్లిన నన్ను ఆప్యాయంగా మాట్లాడించారు. పాపను ఎత్తుకుని నా భర్తను పిలిచి అమ్మాయిని బాగా చూసుకో అంటూ చెప్పారు. సీఎం హోదాలో ఉండి కూడా ఎపుడో నటించిన ఒక చైల్డ్ ఆర్థిస్ట్ ను గుర్తుపెట్టుకోవలసిన అవసరం లేదు. కానీ చాలా ప్రేమగా మాట్లాడారు. ఇక ఆయన మరణం భరించలేక పోయాను.

ఇంకా ఎంతో కాలం ఆయన ఉంటాడనుకుంటే ఇలా అయ్యిందేంటి అని చాలా బాధపడ్డాను. ఇక అలా బాధపడిన మరో వ్యక్తి శ్రీదేవి, ఆమె మరణించిన్నపుడు కూడా చాలా బాధగా అనిపించింది. శ్రీదేవి నాకంటే పెద్దదే అయినా చిన్నపుడు ఇద్దరూ కలిసి సినిమాలలో చేసేటపుడు దేవి అని పిలిచే దాన్ని. నా సోదరిగా భావించాను అలాంటి ఆమె చనిపోతే ఆ విషయమ్ మింగుడు పడలేదు. సావిత్రి, శ్రీదేవి, సౌందర్య వీళ్లందరి మరణాలు మిస్టరీ గానే అనిపిస్తాయి. పైకి కనిపించే కారణాలు నిజమేనా అనిపిస్తాయి అంటూ బేబి రాణి అభిప్రాయపడ్డారు.