Senior Heroin Prabha : అప్పటి దర్శక నిర్మాతలకు బెస్ట్ ఆప్షన్‌ సినీయర్ హీరోయిన్ ప్రభ..!

Senior Heroin Prabha : చిత్రం భళారే విచిత్రం..అంటూ దక్షిణాది తెలుగు చిత్ర పరిశ్రమలో మహారాణిగా ఎన్నో ఏళ్లు ఏలిన అలనాటి నటి ప్రభ. జానపదం, పౌరాణికం, సాంఘీకం ఈ మూడింటిని ఏకచత్రాధిపత్యంతో ఏలిన మహానటి ప్రభ. ఇళ్లాలిగా కనిపించాలన్నా, కమెడీతో కడుపుబ్బా నవ్వించాలన్నా, సీరియస్ యాక్షన్‌తో కథపండించాలన్నా ప్రభకే సొంతం. వైవిధ్యమైన నటనా ప్రతిభకు ప్రభ అప్పట్లో కేరాఫ్ అడ్రస్ అందుకే అప్పటి దర్శక నిర్మాతలకు బెస్ట్ ఆప్షన్‌గా ఉండేది. సన్నివేశం ఏదైనా ఆమె మోములో కనిపించే భావాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తాయి. అమాయకత్వంతో కూడిన అచ్చతెలుగు  గృహిణి పాత్రలకు కేరాఫ్ అడ్రస్ ఆమె.

Heroin Prabha : అప్పటి దర్శక నిర్మాతలకు బెస్ట్ ఆప్షన్‌ సినీయర్ హీరోయిన్ ప్రభ..!

1974లో నీడలేని ఆడది చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యింది ప్రభ. దానవీరశూరకర్ణ చిత్రంలో  దుర్యోధనుడి భార్య పాత్రతో పాపులర్‌ అయ్యింది. దేవతలారా దీవించండి, ఇంటింటి రామాయణం, సంసార బంధం వంటి చిత్రాల్లో మధ్య తరగతి ఇల్లాలి పాత్రల్లో నటించి తెలుగు వారికి మెప్పించి నటిగా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో ఏకంగా 200 లకు పైగా చిత్రాల్లో నటించింది ప్రభ.

అనంతరం గ్యాప్ ఇచ్చిన ఈ నటి యువ హీరో ప్రభాస్ నటించిన రాఘవేంద్ర చిత్రంతో తెలుగు తెరపై అమ్మగా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఆ చిత్రంలోనూ తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత నాగవళ్లి, రెబెల్, కింగ్, రుద్రమదేవి లాంటి చిత్రాల్లో మంచి పాత్రలతో తెలుగు వారిని అలరిస్తూనే ఉంది. అందుకే ఎన్నో అవార్డులు మరెన్నో రివార్డులు ఆమెకు సొంతం. అప్పటి మేటి నటి నర్తకి ఎల్.విజయలక్ష్మి సినిమాలంటే ప్రభకు చాలా ఇష్టం. నాగేశ్వరరావు, ఎంటీఆర్‌ సినిమాలంటే కూడా అమితమైన అభిమానం.

విజయలక్ష్మి డ్యాన్స్‌కు అట్రాక్ట్ అయిన ప్రభ సినిమాల్లో డ్యాన్స్ చేయాలని నిర్ణయించుకుంది. చిన్న క్యారెక్టర్ అయినా చేయాలనుకుంది. ప్రభ అంటే చాలా మందికి మంచి నటిగానే తెలుసు. కానీ నర్తకిగా ఆమె ప్రభ నలుదిశలా వ్యాపించింది. కూచిపూడి నాట్యకళాకారిణి ప్రభ. చిన్నతనం నుంచే ప్రముఖ పేరు మోసిన కళాకారుడు వేంపటి చినసత్యం గారి దగ్గర కూచిపూడి నాట్యం నేర్చుకుని ఇప్పటికీ ఈ శాస్త్రీయ నృత్యాన్ని కొనసాగిస్తూ నే ఉంది.  

తెలుగు నేలపైనే కాదు విదేశాల్లోనూ తన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు ప్రభ. ఎంతో కీర్తిని గడించింది. ఇటు నటన, అటు నాట్యం ఏ చోట కొలువైనా అరుదైన ప్రతిరూపంగా ప్రభ కనిపిస్తుంది. అందుకే అప్పట్లో స్టార్ హిట్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, కృష్ణ, మురళీ మోహన్, చంద్రమోహన్ వంటి టాప్ కథానాయకులతో నటించి వారికి సాటి అభిమానాన్ని సొంతం చేసుకుంది. 4 దశాబ్దాలుగా 200 పైగా చిత్రాలు నటించింది. ఆ చిత్రాలు ఇప్పటికీ ఎప్పటికీ మేటిగానే నిలుస్తున్నాయి.