Featured

Jayasudha : ఒకే ఏడాదిలో 25 సినిమాలు.. అందుకే ఆమె సహజ నటి అయింది.!

Jayasudha : సినిమా ఇండస్ట్రీలో నేచురల్ పర్ఫార్మర్ అనిపించుకోవడం అంత ఈజీ కాదు. అది హీరో అయినా హీరోయిన్ అయినా. ఎందుకంటే ఎక్కువశాతం ఇక్కడ కమర్షియల్ చిత్రాలే రూపొందుతుంటాయి. హీరోలు దాదాపుగా అందరు కమర్షియల్ హీరో అనిపించుకునేందుకు ప్రయత్నిస్తే హీరోయిన్స్ మాత్రం గ్లామర్ క్వీన్ అనిపించుకోవడానికి ఆరాటపడుతుంటారు. భానుమతి, సావిత్రి, జమున లాంటి హీరోయిన్స్ వారి తరంలో కథకు మాత్రమే ప్రాధాన్యమిచ్చేవారు. ఆకాలంలో ఎక్కువగా జానపదం, పౌరాణిక చిత్రాలే ఎక్కువగా రూపొందాయి.

ఆ తర్వాత శ్రీదేవి, జనరేషన్‌లో విజయశాంతి, రాధ, సుహాసిని, మాధవి, రాధిక లాంటి వారు హీరోయిన్స్‌గా ఓ వెలుగు వెలిగారు. వీరంతా ఎక్కువగా గ్లామర్ పాత్రలనే చేయడానికి ఆసక్తి చూపించారు. ఎందుకంటే అప్పుడు చిరంజీవి, సుమన్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణం రాజు, నాగేశ్వర రావు లాంటి వారు ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేసేవారు. వారి పక్కన ఈ హీరోయిన్స్ అందరూ కథా ప్రాధాన్యం ఉన్న సినిమాలతో పాటు గ్లామర్ పాత్రలపైనా ఫోకs పెట్టారు.

అయితే వీరిలో గ్లామర్ రోల్స్ చాలా తక్కువ చేసింది మాత్రం జయసుధనే. ఆమె ఏ హీరో పక్కన నటించిన గ్లామర్ పాత్రలు కాకుండా కథా బలమున్న చిత్రాలను ఎంచుకున్నారు. ఇక ఇంతమంది గ్లామర్ హీరోయిన్స్ మధ్య తన అద్భుతమైన నటనతో సహజ నటి అని విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. స్క్రీన్ మీద జయసుధ పాత్ర కనిపిస్తే ప్రేక్షకులు చాలా ఎమొషనల్ అయ్యేవారు. అగ్ర దర్శకులకు బెస్ట్ ఛాయిస్‌గా జయసుధ నిలిచారు. అసలు పేరు సుజాత అయితే సినిమా రంగానికి జయసుధగా పరిచయమయ్యారు.

నటి, నిర్మాత విజయనిర్మల జయసుధకు మేనత్త అవుతారు. 1972 లో లక్ష్మీదీపక్ దర్శకత్వంలో వచ్చిన పండంటి కాపురం సినిమా ద్వారా జయసుధ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆమె 300లకు పైగా సినిమాల్లో నటించగా వాటిలో 20 తమిళ సినిమాలు, 8 మలయాళ సినిమాలు, 3 హిందీ సినిమాలు, 1 కన్నడ సినిమా ఉన్నాయి. ఇక దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో దాదాపు 25 సినిమాలు, దర్శక రత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో 27 సినిమాల్లో నటించి అగ్ర స్థానంలో నిలిచారు. అంతేకాదు జయసుధ నటించిన సినిమాలు 25 ఒకే సంవత్సరంలో విడుదలవడం ఇప్పటికీ గొప్ప విశేషంగా చెప్పుకంటారు. ఇక జయసుధను అందరూ నిర్మాతల హీరోయిన్ అని చెప్పుకుంటుంటారు. రెమ్యునరేషన్ పరంగా ఎప్పుడూ నిర్మాతలను ఇబ్బంది పెట్టని నటి అని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటుంటారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago