Senior Journalist Bhardwaja : అర్జున్ వెర్సెస్ విశ్వక్ సేన్… హీరోని మార్చడానికే విశ్వక్ మీద బురద జల్లాడా… అర్జున్ నిజంగానే టార్చర్ పెట్టాడా : సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ

Senior Journalist Bhardwaja : విశ్వక్ సేన్ షూటింగ్ కి డుమ్మా కొట్టడానికి సీనియర్ హీరో అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్ ని ఏకిపారేసాడు. ఇది విశ్వక్ కెరీర్ మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. విశ్వక్ సేన్ కూడా మీడియా ముందుకు వచ్చి తాను ఎందుకు షూటింగ్ హాజరు కాలేదో వివరించాడు. తనకు స్క్రిప్ట్ లో సందేహాలు ఉన్నాయంటూ మాట్లాడాడు. సరిగా చిత్ర యూనిట్ కి రాలేక పోతున్నాను అనే విషయాన్ని చెప్పాల్సింది తప్పు చేశాను అంటూ చెప్పాడు. ఇక ఈ ఇష్యూ లో తప్పు ఎవరిది అనే విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు విశ్లేషించారు.

హీరో మార్చడానికే ఈ బురదజల్లే ప్రోగ్రామ్…

విశ్వక్ సేన్, అర్జున్ వివాదం లో విశజ్వక్ సేన్ ది తప్పు అన్నట్లుగా భరద్వాజ గారు అభిప్రాయపడ్డారు. ఒక పెద్ద హీరో ఇచ్చిన పార్టీ లో రాత్రి ఉండటం వల్ల ఉదయాన్నే షూటింగ్ కి విశ్వక్ రాలేక పోయాడు. కానీ ఆల్రడీ షూటింగ్ ఉంది అని తెలిసినపుడు ఒకసారి తన వల్లే వాయిదా పడింది అన్నపుడు మరోసారి తప్పు జరగకుండా చూసుకోవాల్సింది. అదీ కాక స్క్రిప్ట్ లో సందేహాలు ఉన్నాయంటూ ఇప్పుడు చెప్పడం ఏమిటి సినిమా కథ విన్నప్పుడు అడిగితే ఒకవేళ కథ నచ్చకపోయుంటే వాళ్ళు వేరే హీరోని చూసుకునేవాళ్ళు. బలవంతంగా చేయమని ఎవరూ చెప్పారు. కథ చర్చలప్పుడు స్క్రిప్ట్ లో హీరో వేలు పెట్టడానికి ఉంటుంది కానీ అన్నీ ఫైనల్ అయి షూటింగ్ జారిగే సమయంలో ఇలా మళ్ళీ కథలో డౌట్లు అనడం తప్పు.

పాత రోజుల్లో కథ నచ్చక పోతే నిర్మొహమాటంగా చెప్పేవారు. ఒక్కసారి ఒప్పుకున్నాక కథ ఎలా ఉన్నా సినిమా చేసేవాళ్ళు. ఇప్పుడున్న హీరోలలో ఆ డెడికేషన్ లేదు అంటూ భరద్వాజ అభిప్రాయపడ్డారు. ఒక కమిట్మెంట్ ఇచ్చాక ఇలా షూటింగ్ రాకుండా మానుకుంటే సినిమా ప్రొడక్షన్ కాస్ట్ నష్టం ఎవరు భరిస్తారు. హీరో రాకపోతే ఆయన కాంబినేషన్ లో ఇతర ఆర్టిస్టుల సీన్స్ ఉండొచ్చు వారి డేట్స్ కూడా మళ్ళీ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది ఈ నష్టాన్ని హీరో భరిస్తాడా అన్నదే సమస్య. కాబట్టి విశ్వక్ సినిమా చేయడం ఇష్టం లేకపోతే ముందే చెప్పాల్సింది షూటింగ్ వరకు వచ్చాక ఇలా చేయడం తప్పు అంటూ చెప్పారు.