YS Sharmila: ఏపీ రాజకీయాలకు వైయస్ షర్మిల గుడ్ బై చెప్పినట్టేనా.. డిపాజిట్లు కూడా రావా?

YS Sharmila: ఏపీ ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీ రాబోతున్నాయి. ఇప్పటికే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ లో భాగంగా కొన్ని సర్వేలు కూటమికి అధికారం రాబోతుందని చెప్పగా మరికొన్ని సర్వేలు జగన్మోహన్ రెడ్డి తిరిగి విజయం సాధిస్తారని వెల్లడించారు. ఇకపోతే ఎన్నికలకు మూడు నెలల ముందు ఏపీ రాజకీయాలలోకి వచ్చి సంచలనంగా మారారు వైయస్ షర్మిల.

ఎవరు ఊహించని విధంగా ఈమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని ఏపీపిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈ మూడు నెలల కాలంలో వైఎస్ షర్మిల తన అన్నయ్య ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ఇక వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కూడా ఈమె సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఇలా కీలకమైన సబ్జెక్ట్ ఎంచుకొని పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేసినటువంటి షర్మిల ఎలాగైనా ఈ ఎన్నికలలో ఒక ఐదు నుంచి పది స్థానాలలో విజయం సాధిస్తారని అందరు భావించారు. అయితే తాజాగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే మరోసారి కాంగ్రెస్ ఏపీలో చతికిల పడిందని స్పష్టంగా తెలుస్తోంది. ఇక కడపలో ఎంపీగా పోటీ చేస్తున్న ఈమెకు డిపాజిట్లు కూడా రావడం కష్టమేనని తెలుస్తోంది.

చతికిల పడిన కాంగ్రెస్..
కాంగ్రెస్ ఏ ఒక్క స్థానంలో గెలిచే అవకాశం లేకపోవడంతో మరోసారి ఏపీలో కాంగ్రెస్ కనుమరుగవుతుందని దీంతో వైఎస్ షర్మిల కూడా తట్ట బుట్టా సర్దుకొని పార్టీకి అలాగే ఏపీ రాజకీయాలకు కూడా దూరం కాబోతున్నారని స్పష్టంగా తెలుస్తుంది.