గమనం రివ్యూ: శ్రియ గమనం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందా?

శ్రియ శరణ్ నటించిన ‘గమనం’ సినిమా ఈరోజు విడుదలయింది. ఈ సినిమాతో సుజనా రావు డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఇక ఇందులో శ్రియ తో పాటు శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, సుహాస్, నిత్యా మీనన్, బిత్తిరి సత్తి, సంజయ్ స్వరూప్, రవి ప్రకాష్ తదితరులు నటించారు. ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించాడు. క్రియ ఫిలిం కార్ప్, కలి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్ కురుటూరి, వెంకీ పుష్పదపు, జ్ఞాన శేఖర్ వి.ఎస్ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా ఈ రోజు విడుదల కావటంతో ఎటువంటి సక్సెస్ అందుకుందో చూద్దాం.

కథ: ఈ సినిమా కథ మూడు కథలతో కూడి ఉంది. అందులో మొదటిది.. శ్రియ చెవులు వినపడని దివ్యాంగురాలుగా కమల అనే పాత్రలో నటించింది. ఇక ఈమె ఓ మురికివాడ ప్రాంతంలో నివసిస్తుంది. ఈమెకు పెళ్లి అవ్వగా తన భర్త దుబాయ్ లో ఉంటాడు. తనకు ఒక బిడ్డ కూడా ఉంటుంది. తను దుబాయ్ లో ఉన్న తన భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. తన భర్త మాటలు వినాలని చెవులు వినిపించేందుకు చికిత్స కూడా తీసుకుంటుంది. మరొకటి శివ కందుకూరి అలీ అనే పాత్రలో నటిస్తాడు. ప్రియాంక జవాల్కర్ జారా అనే పాత్రలో నటిస్తుంది. వీరిద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఆలీకి క్రికెటర్ అవ్వాలని కోరిక ఉంటుంది. ఇక చివరి కథలో.. ఇద్దరు అనాథ పిల్లలు ఉంటారు. వారికి పుట్టినరోజు అంటే ఎలా ఉంటుందో అని కూడా తెలియదు. దీంతో కేకు కోసం డబ్బులు సంపాదించుకుంటారు. ఆ తర్వాత ఈ మూడు కథలు అనేవి ప్రకృతి విపత్తులతో మలుపులు గా తిరుగుతుంది. అలా చివరికి ఏం జరుగుతుంది అనేది మిగతా కథలోనిది.

నటినటుల నటన: శ్రియ శరణ్ తన పాత్రతో బాగా ఆకట్టుకుంది. మిగతా నటీనటులందరూ కూడా తమ పాత్రలతో మెప్పించారు.

టెక్నికల్: తొలిసారిగా దర్శకుడిగా పరిచయమైన ఈ డైరెక్టర్ అద్భుతమైన కథ తీసుకున్నాడు. బ్యాక్ గ్రౌండ్ బాగానే ఉంది. సంగీతం ఆకట్టుకుంది.

విశ్లేషణ: ఇక డైరెక్టర్ ఈ కథను తెరపై అంతగా చూపించలేకపోయాడు. చాలా వరకు పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంచుకున్నారు కానీ కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించింది.

ప్లస్ పాయింట్స్: శ్రియ నటన, కొన్ని కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్: సినిమా కాస్త నెమ్మదిగా సాగినట్లు కాకుండా ఉంటే బాగుండేది. ఎమోషనల్ ఎక్కువగా ఉంటే ఇంకా బాగుండేది.

బాటమ్ లైన్: తొలిసారి దర్శకత్వంలోనైనా ఈ సినిమాతో కొంతవరకు మెప్పించాడు డైరెక్టర్.

రేటింగ్: 3.0/5