ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన RRR ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ సినిమా జనవరి 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ ను ముంబైలో ఎంతో వేడుకగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, రాజమౌళి, డి.వి.వి.దానయ్య, అలియా భట్, అజయ్ దేవగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీరందరూ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఇకపోతే ఈ కార్యక్రమం తర్వాత ఎన్టీఆర్ మాట్లాడుతూ బాలీవుడ్ మీడియాను ఆకట్టుకున్నారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ మొట్టమొదటిసారి ఈ సినిమా ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సినిమాలో నటించిన అజయ్ దేవగన్ ఎంతో టాలెంటెడ్ హీరో అని ఇప్పటికి తనని ఒక గురువుగా భావిస్తానని ఎన్టీఆర్ తెలిపారు. ఇక ఆయన అనుభవం ముందు మేమందరం చిన్నపిల్లలని అజయ్ దేవగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక ఈ సినిమా తర్వాత తాను కొరటాల శివ దర్శకత్వంలో, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నానని అవన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కుతున్నాయని తెలిపారు.ఇకపోతే ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరుకాలేకపోయారు అందుకు గల కారణం ఉపాసన సోదరి వివాహం ఉండటం వల్ల రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయారని వివరించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…