డాక్టర్ల హెచ్చరికలు సిద్ధార్థ్ శుక్లా పట్టించుకోలేదా..? ఆయన మరణానికి అదే కారణమా!

బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ సీజన్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా ఉదయం 10: 30 నిమిషాలకు తీవ్రమైన గుండెనొప్పితో మరణించిన సంగతి మనకు తెలిసిందే. ఆయన అకాల మరణం ఎంతోమంది అభిమానులకు తీరని శోకంగా మిగిలింది. ఎల్లప్పుడూ ఎంతో చురుకుగా సరదాగా ఉండే సిద్ధార్థ్ శుక్లా మరణం అందరినీ ఎంతగానో క్రుంగదీసింది. అసలు సిద్ధార్థ్ శుక్లా మరణించడానికి ముందు రోజు రాత్రి ఏం జరిగింది అనే విషయానికి వస్తే…

సిద్ధార్థ్ నిత్యం ఎక్కువ వర్కౌట్స్ చేస్తూ గడిపేవాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఆయన రాత్రి 8 గంటలకు ఇంటికి చేరుకొని రాత్రి పది గంటల సమయం వరకు కొన్ని వర్కౌట్స్, జాగింగ్ చేశారని, ఆ తర్వాత తను పడుకునే ముందు కొన్ని మందులు తీసుకొని పడుకున్నారని, మూడు గంటల సమయంలో చాతిలో నొప్పి రావడం చేత తన తల్లి సహాయంతో మంచి నీటిని తాగి ఉపశమనం పొందిన సిద్ధార్థ్ ఆ తర్వాత మరి పడుకున్నారని తెలుస్తోంది. అయితే ఆ నిద్రలోనే అతను మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడిస్తున్నాయి.

సిద్ధార్థ్ 40 సంవత్సరాలకే తీవ్రమైన గుండెపోటు రావడానికి కారణం అతడు ఎక్కువగా వర్కౌట్స్ చేయడమే కారణమని వైద్యులు భావిస్తున్నారు. శరీర ఫిట్నెస్ కోసం ఎంతో ప్రాధాన్యత ఇచ్చే సిద్ధార్థ్ ప్రతిరోజు ఎక్కువ సమయం వర్కౌట్ చేసేవారని తెలుస్తోంది. ఈ విధంగా ఎక్కువ సమయం వర్క్ ఔట్స్ చేయడం వల్ల అత్యంత ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు.

ఇంత చిన్న వయసులోనే అధిక ఒత్తిడి, ఆర్థిక జీవన శైలి కారణంగా చిన్న వయసు వారికి ఈ విధమైనటువంటి గుండెపోటు సమస్యలు రావడం సర్వసాధారణం ఇలాంటి విషయాల గురించి వైద్యులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కేవలం శరీర ఫిట్ నెస్ కి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ విధమైనటువంటి గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలియజేస్తున్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత కూడా ముఖ్యమని, మానసిక ప్రశాంతత ఉన్నప్పుడే ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తవని వైద్యులు తెలిపారు.