నగిరి ఎమ్మెల్యే రోజా అటు బుల్లితెర జడ్జిగాను.. మరో వైపు బాధ్యాతయుత నాయకురాలిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా ఉన్నారు. అయితే ఈటీవీలో త్వరలో ప్రసారం కానున్న ఓ ప్రోగ్రామ్ కు సంబంధించి ఓ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. అందులో రోజా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు.
ఇన్నాళ్లు తనలో దాచుకున్న విషయాన్ని ఈ షో ద్వారా బయటపెట్టారు. వినాయక చవితి స్పెషల్‌గా ఈటీవీలో ఊరిలో వినాయకుడు పేరుతో ఓ స్పెషల్ షో చేశారు. అందులో ఆమె మాట్లాడుతూ.. తన పెళ్లికి ముందు ఎన్నో కష్టాలను అనుభించానని.. చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మొదట్లో తన జీవితంలో మొత్తం అప్పులు కట్టడానికి తన సంపాదన సరిపోయేదని.. ఆమె వాపోయింది.
1991 లో చిత్ర పరిశ్రమకు వచ్చానని.. 2000 వరకు స్టార్ హీరోయిన్ గా రాణించినా.. 2002 వరకు తాను నటించి సంపాదించిందంతా అప్పులు కట్టడానికే సరిపోయిందంటూ ఎమోషనల్ అయ్యారు. పెళ్లికి ముందు ఆమెకు డాక్టర్లు పిల్లలు పుట్టరని చెప్పారట.. ఆ విషయాన్ని ఆమె గుర్తు చేసేకొని భావోద్వేగానికి గురయ్యారు.
కానీ పెళ్లి అయిన ఏడాదిలోపే తనకు ప్రెగ్నేన్సీ వచ్చిందంటూ.. చెప్పుకొచ్చింది. మొదట తనకు అన్షు పుట్టిందని.. అందుకే తనంటే చాలా ఇష్టమంటూ చెప్పారు. ఈ విషయాలను చెబుతున్న సమయంలో ఇద్రజ, రష్మీ కూడా కన్నీళ్లను పెట్టుకొని రోజాను ఓదార్చారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇందులో రష్మీ, సుధీర్, రోజా, హైపర్ ఆది, వర్ష చేసిన సందడి ఆకట్టుకుంటోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…