కొంతమంది అనతి కాలంలోనే పెద్ద స్టార్స్ అయిపోతుంటారు. మరికొంత మంది చిన్నతనం నుంచి కష్టపడుతూ.. ఒకానొక దశకు వచ్చేసరికి వాళ్లకు తిరుగు లేకుండా ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి బాగా జరుగుతాయి. సీనియర్ ఆర్టిస్టు అయిన శ్రుతి.. అప్పట్లో సీరియల్ లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
అంతే కాకుండా ఆమె కోసం సీరియల్ డైరెక్టర్స్ సైతం తమ డేట్స్ ను మార్చుకున్నారంటే అర్థం చేసుకోవాలి.. ఆమె అంతగా పాపులారిటీ తెచ్చుకున్నారని. ఆమె ఒక్క సినీ ఆర్టిస్టుగానే కాకుండా రేటియో జాకీగా, యాంకర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పని చేశారు. దూరదర్శన్ లో రుతురాగాలు సీరియల్ ఆమె కెరీర్ కు ఒక మైలు రాయి అని చెప్పుకోవచ్చు.
దాని తర్వాత ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. అయితే అప్పటికే ఆమె చదువుకుంటుండగా.. చదువుకు ఇబ్బంది అవుతుందని ఆమె తల్లి నాగమణి సీరియల్ లో చేయవద్దు అని చెప్పిందట. అయినా వాళ్లు ఆమెకు సెలవులు ఉన్న సమయంలోనే చేయమని ఆఫర్ కూడా ఇచ్చారు. తర్వాత టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అప్పట్లో దూరదర్శన్ లోని ఓ సీరియల్ ని డైరెక్ట్ చేసారు..
అప్పుడు శ్రుతి, పూరి కలిసి సీరియల్ చేశారు. తర్వాత ఆమె మొగలి రేకులు, నాగాస్త్రం , కన్యాశుల్కం, చంద్రముఖి, ఇంటింటి రామాయణం వంటి సూపర్ డూపర్ సీరియల్స్ లో నటించింది. ఇప్పటికీ వీరిద్దరి మధ్య మంచి స్నేహ బంధమే ఉంది. అయితే అప్పట్లో పూరి జగన్నాథ్ మొదటి హీరోయిన్ గా చేసిన శ్రుతి.. ప్రస్తుతం బామ్మ అంటూ.. సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…