Silk Smitha : నేను కొరియోగ్రాఫర్ గా చేస్తే తను డ్యాన్స్ చేయనంది.. తీసుకున్న చెక్ కూడా వాపస్ ఇచ్చింది.. అంతే ఆర్థికంగా దిగజారిపోయింది. : శివశంకర్ మాస్టర్.

Silk Smitha : సిల్క్ స్మిత‌ ఎన్నో సంవత్స‌రాల పాటు ఈమె తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఐట‌మ్ భామ‌గా, న‌టిగా మెరిసింది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల అర్థాంత‌రంగా త‌నువు చాలించింది. ఈమె బ‌యోపిక్‌ను వెండితెర‌పై తీశారు కూడా. అయితే ప‌ల్లెటూరి నుంచి వ‌చ్చిన అమ్మాయి సిల్క్ స్మిత‌గా ఎలా స్టార్ అయింది.. అస‌లు ఆమె సినిమా ప్ర‌వేశం ఎలా జ‌రిగింది.. త‌దిత‌ర వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. సిల్క్ స్మిత అస‌లు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. ఏలూరులో జన్మించిన ఈమె తండ్రి రాములు, తండ్రి నర్సమ్మ. ఆర్థిక స‌మ‌స్య‌ల‌ వల్ల విజయలక్ష్మిని 5వ తరగతిలోనే చదువు మానిపించారు.

14 ఏళ్లకే పెళ్లి చేశారు. కానీ భర్త, అత్తమామలు ఆమెను ఎప్పుడూ హింసించేవారు. తన కష్టాలను మేనత్తకు చెప్పుకోగా.. ఏదో ఒక పని ఇప్పిస్తా అని ఆమెను చెన్నైకి తీసుకువచ్చింది మేనత్త. అక్కడ తనకు తెలిసిన‌ వారితో మేకప్ వేయించడం నేర్పించడంతో జూనియర్ ఆర్టిస్టులకు మేకప్‌ చేసుకుంటూ గడిపేది. కానీ ఒక‌రోజు నిర్మాత విను చక్రవర్తి భార్య షూటింగ్ జరిగే దగ్గర సిల్క్ స్మిత‌ను చూసి ఈమె నటి అయితే బాగుంటుంది అని ఆమెను అడిగారు. ఆమె కూడా ఒప్పుకోవడంతో రెండు నెలలు తమ వ‌ద్ద పెట్టుకుని నటన, డ్యాన్స్ కెమెరా ముందు ఎలా ఉండాలి అనేది నేర్పించారు. ఆ తర్వాత స్మిత అని పేరు మార్చి సినిమాలో అవకాశం ఇచ్చారు.
అయితే చక్రవర్తి సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో నటించిన స్మిత కు ఆ పేరు వచ్చి.. అది అలానే కొనసాగింది. కానీ ఆ తర్వాత కొంత మంది డబ్బు ఆశ చూపించి కేరళ తీసుకెళ్లి బి గ్రేడ్ సినిమాల్లో నటింపజేశారు. ఆ తర్వాత కూడా మిగితా సినిమాలో అవకాశాలు దకించుకున్న సిల్క్ స్మిత ఐటం గర్ల్ గా అలాగే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

నటిగా పేరు బాగా సంపాదించిన‌ సిల్క్ స్మిత డబ్బు కూడా బాగానే సంపాదించింది.. అయితే శివ శంకర్ మాస్టర్ ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 1985లో వచ్చిన “భలే తమ్ముడు” చిత్రానికి గాను తనను దర్శకులు పరుచూరి బ్రదర్స్ కొరియోగ్రాఫర్ గా ఎంచుకున్నారు. ఆ సినిమాలో బాలకృష్ణతో ఐటమ్ సాంగ్ కి సిల్క్ స్మితను అనుకొని చెక్ అడ్వాన్స్ గా ఇచ్చారు. నేను ఆ పాటకు నృత్య దర్శకునిగా చేస్తున్నానని తెలుసుకున్న సిల్క్ స్మిత వేరొక వ్యక్తితో నేను కొరియోగ్రాఫర్ గా చేస్తే ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ లో చేయనని చెప్పారని అతను చెప్పారు. నేను ఒక్కసారి అవాక్కయ్యాను. ఆ విషయం తెలుసుకొని ఆ సినిమా నుంచి పక్కకు వైదొలుగుదాం అనుకున్నాను.

కానీ దర్శక నిర్మాతలు నేను కొరియోగ్రాఫర్ గా ఉండాలని అవసరమైతే సిల్క్ స్మిత ప్లేస్ లో మరొకరిని ఐటమ్ గర్ల్ గా తీసుకుంటామని చెప్పారు. ఆ విషయం తెలుసుకున్న సిల్క్ స్మిత తనకు అడ్వాన్స్ గా ఇచ్చిన చెక్కును రిటర్న్ చేశారు. అలాగే సిల్క్ స్మిత ఫైనాన్షియర్ కూడా ఆమెకు ప్రేమ పేరుతో దగ్గరై మొత్తం డబ్బుతో పరారయ్యాడు. ఆ మోసాన్ని తట్టుకోలేకపోయిన సిల్క్ స్మిత బాగా కుంగిపోయింది. అప్పుడే తాగుడుకు బానిసైన సిల్క్ స్మిత 1996లో ఆత్మహత్య చేసుకుంది. అలా ఆమె అర్థాంత‌రంగా త‌నువు చాలించిందన్నారు. ఆమె మంచి బ్యూటిఫుల్ డాన్సర్ అని, ఆమె చీర కడితే ఎంతో అందంగా ఉంటారని ఆ ఇంటర్వ్యూలో శివశంకర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.