Actor Taapsee: తెలుగు చిత్ర పరిశ్రమకు ఝుమ్మంది నాదం సినిమా ద్వారా పరిచయమయ్యారు సొట్టబుగ్గల సుందరి తాప్సీ. ఇలా తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో సినిమాలలో నటించడమే కాకుండా తాజాగా నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఇకపోతే తాప్సీ గతంలో ఎన్నోసార్లు ఫోటోగ్రాఫర్లపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం మనకు తెలిసిందే.ముఖ్యంగా ఆమె నటించిన దొబెరా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె కోసం ఫోటోగ్రాఫర్లు ఎక్కువ సమయం పాటు ఎదురుచూసిన అనంతరం ఈమె వారిని పట్టించుకోకుండా వెళ్లడంతో ఫోటోగ్రాఫర్లు కొంతమేర అసహనం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా ఫోటోగ్రాఫర్లపై తాప్సీ విరుచుకుపడింది.
ఇలా ఈ ఘటనతో ఈమె సోషల్ మీడియా వార్తలలో నిలిచారు. అయితే ఈ విషయం మర్చిపోకముందే మరోసారి ఈమె ఫోటోగ్రాఫర్లకు వార్నింగ్ ఇచ్చారు. తాజాగా తాప్సీ ఓ కార్యక్రమం అనంతరం తిరిగి వెళుతుండగా ఆమె కారులోకి వెళ్లి కూర్చొని కారు డోర్ వేసుకోబోతుండగా ఒక ఫోటోగ్రాఫర్ ఆమె కారు డోరు వేయకుండా చేతిని అడ్డు పెట్టారు.
ఈ విధంగా ఫోటోగ్రాఫర్ చేతిని అడ్డుగా పెట్టడంతో తాప్సీ మండిపడింది. ఇంకోసారి ఇలా చేయొద్దు అంటూ తనకు వార్నింగ్ ఇవ్వడంతో చేసేదేమీ లేక ఫోటోగ్రాఫర్ తన చేతిని తీశారు.ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయంపై కొందరు తాప్సీని విమర్శించగా, మరికొందరు మద్దతు తెలుపుతున్నారు.ఏది ఏమైనా ఇలా వరుసగా తాప్సీ ఫోటోగ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేయడంతో నేటిజెన్ల ఆగ్రహానికి గురవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…