Singer Chinmayi: టైట్ గా ఉండి…. రక్తం వస్తేనో వర్జిన్ కాదు… సంచలన వ్యాఖ్యలు చేసిన సింగర్ చిన్మయి!

Singer Chinmayi: సింగర్ చిన్మయి పరిచయం అవసరం లేని పేరు తెలుగు తమిళ భాషలలో సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ అమ్మాయిలు సమాజంలో ఎదుర్కొనే సమస్యల గురించి తన గళం వినిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే చిన్మయి భారీగా సోషల్ మీడియా ట్రోల్స్ కు కూడా గురవుతూ ఉంటారు.

ఇలా తన గురించి ఎన్ని విమర్శలు వచ్చిన పట్టించుకోనటువంటి చిన్మయి సమాజంలో అమ్మాయిల పట్ల అబ్బాయిల వ్యవహరించే తీరు వారి ఆలోచన విధానాల గురించి తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా అమ్మాయి వర్జినిటీ గురించి బోల్డ్ కామెంట్స్ చేశారు.

చాలామంది అబ్బాయిలు అమ్మాయిల విషయంలో అపోహలు కలిగి ఉన్నారంటూ ఈమె వర్జినిటీ గురించి తెలియజేశారు.అసలు వర్జినిటీ అంటే మొదటిసారి శృంగారంలో కలిసినప్పుడు టైట్ గా ఉండి నొప్పి వస్తే బ్లడ్ వస్తేనో వర్జినిటీ అనుకుంటారు. ఎవరు కూడా అలా అనుకోవద్దు ఇలా జరిగే ప్రచారంలో నిజం లేదని తెలిపారు.

Singer Chinmayi: నొప్పి ఉంటే వైద్యున్ని సంప్రదించాలి…


ఇలా సెక్స్ విషయంలో అబ్బాయిల ఆలోచన ధోరణి మారాలన్న ఉద్దేశంతోనే తాను ఇలాంటి బోల్డ్ కామెంట్స్ చేశానని ఈమె తెలియజేశారు. ఇలా తొలి కలయికలో నొప్పి కనుక ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాలని ఈమె సూచించారు.ఇలా ఈ విషయాలపై వచ్చే ట్రోల్స్ విమర్శలు గురించి ఎవరు పట్టించుకోవద్దు అంటూ ఈ సందర్భంగా ఈమె యువతకు సూచించారు.