Singer Chinmayi: జాకెట్ వేసుకోకపోవడమే భారతీయ కల్చర్…. సంచలన వ్యాఖ్యలు చేసిన చిన్మయి!

Singer Chinmayi: ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి తెలియని వారంటూ ఉండరు. చిన్మయి సింగర్ గా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా సమంత నటించిన దాదాపు అన్ని సినిమాలకు చిన్మయి వాయిస్ ఓవర్ ఇచ్చింది. అయితే ఇటీవల సమంత తన సినిమాలకు తాను డబ్బింగ్ చెప్పుకోవడం మొదలు పెట్టడంతో చిన్మయి సమంత మధ్య గొడవలు జరుగుతున్నాయని వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా సింగర్ గా మంచి గుర్తింపు పొందిన చిన్మయి మీటు ఉద్యమం ద్వారా మరింత పాపులర్ అయింది.అప్పటినుండి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే చిన్మయి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరొకసారి భారతీయ సంస్కృతి గురించి చిన్మయ చేసిన వ్యాఖ్యల వల్ల ఆమె వార్తల్లో నిలిచింది. డ్రెస్​ల మీద చున్నీలు వేసుకోవడం మానేస్తున్నారని ఒక యువకుడు ఓ వీడియో షేర్ చేశాడు. వాళ్లు ఎలాగూ వేసుకోవడం లేదు కాబట్టి.. తాను వేసుకుంటానని వీడియోలో చెప్పుకొచ్చాడు.

ఈ వీడియో గురించి సినిమా ఈ తనదైన శైలిలో స్పందించింది.చున్నీలు వేసుకోవాలని చెప్పేవాళ్లు ముందు మన దేశ కల్చర్ గురించి తెలుసుకోవాలని తెలిపింది. మన భారతీయ సంస్కృతి లో మన పూర్వీకులు బ్లౌజులు ధరించేవారు కాదని, ఆడవారు జాకెట్ వేసుకోకపోవటమే మన భారతీయ సంస్కృతి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య సత్యేంద్రనాథ్ ఠాగూర్ భార్య జ్ఞానానందిని దేవి మనదేశంలో ఆడవాళ్లు వేసుకునే జాకెట్ కల్చర్​ను తీసుకొచ్చారని చిన్మయి చెప్పారు.

Singer Chinmayi: జాకెట్ ధరించడం బ్రిటిష్ కల్చర్…


పూర్వం 9 గజాలు 7 గజాలు చీరలను జాకెట్ లేకుండానే జాకెట్ గా మడిచి కట్టుకునే వారని తెలిపింది. జాకెట్ ధరించడం అనేది బ్రిటిష్ కల్చర్ అని, జాకెట్ లేకుండా ఉండటం చూసి బ్రిటిషర్లు షాక్ అయ్యారని.. స్త్రీలను బ్లౌజ్ లేకుండా చూస్తే వాళ్లకు కలిగిన లైంగిక కోరికల వల్లే భారతీయ మహిళలు జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టారని చిన్మయి వివరించారు. మన ఇండియన్ కల్చర్ గురించి మాట్లాడే వారు కూడా షర్టు ప్యాంటు తీసేసి ధోతి, పంచ ధరించమని చెబుతూ కౌంటర్ వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.