Categories: FeaturedMovie News

Actor Shivaji : పోసాని కృష్ణ మురళి ఎవరో నాకు తెలియదు… ఆయన అవార్డు తీసుకోకపోతే వచ్చే నష్టమేంటి… నేను వైఎస్ఆర్ ఇస్తే తీసుకున్నాను…: యాక్టర్ శివాజీ

Actor Shivaji : వైఫ్, మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్య చంద్రం వంటి సినిమాలలో నటించి హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు శివాజీ. అయితే ఈ సినిమాల కంటే ముందే శివాజీ దాదాపు తెలుగులోని అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుని సహాయక పాత్రలు చేసి మెప్పించారు. అయితే శివాజీ సినిమాల్లో నటించాలని, హీరో అయిపోవాలనే ఆలోచనతో ఇండస్ట్రీ వైపుకి రాలేదు. డిగ్రీ అయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన శివాజీ కి కే.ఎస్ రామారావు గారి వద్ద ఎడిటింగ్ సూట్ నేర్చుకునే అవకాశం వచ్చి అక్కడ నేర్చుకున్నాక జెమినీ టీవిలో ఎడిటర్ గా పనిచేస్తూ అనూహ్యంగా యాంకర్ అయ్యాడు. అలా యాంకర్ గా ఉన్న సమయంలోనే రాఘవేంద్ర రావు పరదేశి సినిమా ఆడిషన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుండగా పాల్గొని అందులో లయతో పాటు రెండో ప్లేస్ తెచ్చుకున్నాడు. అలా ఇండస్ట్రీ కంట పడిన శివాజీ ఆపైన మాస్టర్ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటూనే హీరోగా వచ్చిన అవకాశాలను చేస్తూ మరోవైపు డబ్బింగ్ కూడా చెప్పిన శివాజీ ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టి రాజకీయాలలో చురుగ్గా ఉంటున్నారు.

పోసాని ఎవరో నాకు తెలియదు…

రాజకీయాల్లో కులం కార్డు ఉపయోగించే వాళ్లంటే నాకు నచ్చదు అంటూ తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన శివాజీ ఎన్టీఆర్ రాజకీయాల్లో ఉన్నపుడు కులం కార్డు లేదని, ఎపుడైతే చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యారో ఆయన అభివృద్ధి చూసాక కులం కార్డు, అలాగే తెలంగాణ వాదం బయటికి తీశారు అంటూ శివాజీ ఆయన అభిప్రాయాలను తెలిపారు.

ఇక పోసాని గారు ఇటీవల కమ్మ నందులు అంటూ మాట్లాడటం గురించి ఇంటర్వ్యూలో ప్రశ్న రాగా పోసాని లాంటి పెద్ధ మనిషి గురించి నేను మాట్లాడను అంటూనే కమ్మ నందులైతే రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలోనే నాకు నంది అవార్డు వచ్చింది. అలాగే మహేష్ బాబుకి కూడా నంది అవార్డు వచ్చింది. మరి కమ్మనందులు ఎలా అయ్యాయి అపుడు అంటూ కులం కార్డు వాడి రాజకీయాలను వైసీపీ వ్యూహకర్త పీకే మరింత ఎక్కువ చేస్తారు. ఇప్పుడు అన్ని కులాల్లోను చిచ్చు పెట్టి రాజకీయం చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత కుల పిచ్చి ఇంకెక్కడా కనిపించదు అంటూ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago