MM Srelekha: నాయుడు గారు నన్ను, దాసరిని కోటి రూపాయలు పోగొట్టినందుకు తిట్టేవారు.. సంగీతం నేర్పమంటే బాలుగారు అలా అన్నారు: ఎం ఎం శ్రీలేఖ

MM Srelekha: ఎం ఎం శ్రీలేఖ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ఏకైక మహిళ సంగీత దర్శకురాలు. ఈమె చిన్నప్పటి నుంచి సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి పెరగడం వల్ల తనకు కూడా సంగీతంపై ఎంతో మక్కువ ఏర్పడింది. శంకరాభరణం సినిమా చూసి తాను సింగర్ గా స్థిరపడాలని నిర్ణయం తీసుకున్నానని శ్రీలేఖ ఒక ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు. ఇకపోతే ఎం ఎం కీరవాణి అన్నయ్యతో కలిసి మ్యూజిక్ కంపోజ్ చేస్తూ అలా సంగీత దర్శకురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చానని తెలిపారు.

తన మొట్టమొదటి సినిమా తమిళ హీరో విజయ్ తో చేశానని తెలిపారు. ఇకపోతే కొండపల్లి రత్తయ్య సినిమాకి కూడా సంగీత దర్శకత్వం వహించానని,ఈ సినిమా ఫ్లాప్ కావడంతో రామానాయుడు ఎప్పుడూ కూడా కోటిపల్లి రత్తయ్య అంటూ నన్ను దాసరి గారిని కలిపి తిట్టే వారు అంటూ ఈ సందర్భంగా శ్రీలేఖ వెల్లడించారు.ఈ సినిమాకు దాసరి దర్శకత్వం వహించగా,తాను సంగీత దర్శకత్వం వహించానని ఈ సినిమా ఫ్లాప్ కావడంతో కోటి రూపాయలు నష్టం రావడం వల్ల నాయుడు గారు చనిపోయేవరకు మమ్మల్ని కోటి రూపాయలు గురించి ప్రస్తావిస్తూ తిట్టేవారు అంటూ సరదాగా తెలియజేశారు.

ఇకపోతే తాను ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన సంగతి మనకు తెలిసిందే. ఇందులో ఎన్నో మంచి హిట్ అందుకున్నాయి.ఇకపోతే తన కెరీర్లో ఏ విధమైనటువంటి ఆటుపోట్లు ఎదురయ్యాయ అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ ఎక్కడైనా మంచి ఉంది అంటే తప్పకుండా చెడు కూడా ఉంటుంది.నా కెరీర్లో కూడా అలాంటి ఆటుపోట్లు ఉన్నాయి అయితే నేను పెద్దగా వాటి గురించి పట్టించుకోలేదని తెలిపారు.

గాడిద గొంతు అన్నారు…

ఇకపోతే తనకు సంగీత దర్శకురాలిగా కన్నా సింగర్ గా పాట పాడటం ఎంతో ఇష్టం ఇలా సింగర్ కావాలని కోరుకుంటున్నట్లు ఇంట్లో చెప్పడంతో ఇంట్లో వాళ్లు కూడా ఏదో ఇష్టపడుతుంది కదా అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి తీసుకువెళ్లి సంగీతం నేర్పించాలని అడిగారు. ఈ విధంగా అడిగేసరికి బాలు గారు నేను తనకి సంగీతం నేర్పించనని మొహం మీదే చెప్పారు. తన గొంతు గాడిద గొంతులా ఉంది. తనకు నేను సంగీతం నేర్పించనని బాలు గారు చెప్పినట్టు ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎం.ఎం.శ్రీలేఖ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.