Featured

Adi Pinishetty : హీరో ఆది పినిశెట్టి పెళ్లి కట్నం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Adi Pinishetty : తెలుగులో ఎన్నోహిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన రవి రాజా పినిశెట్టి వారసుడిగా తెలుగు తమిళ్ సినిమాలలో రానిస్తున్నాడు ఆది పినిశెట్టి. తమిళ్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది తెలుగులో కూడా గుండెల్లో గోదారి, ఒక విచిత్రం, మలుపు, సరైనోడు, రంగస్థలం, నిన్నుకోరి వంటి సినిమాలలో నటించి అభిమానులను సొంతం చేసుకున్నాడు. సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ కి విలన్ గా నటించి మెప్పించాడు. ఇక తాజాగా ఇప్పుడు పోతినేని రామ్ హీరోగా వస్తున్న వారియర్ సినిమాలో కూడా విలన్ గా నటించబోతున్నాడు.

ఆది పినిశెట్టి గత నెల మే 18 న ఒక ఇంటి వాడు అయిన సంగతి తెలిసిందే. ఆది, హీరోయిన్ నిక్కి గల్రానీ ఒకరికొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరు 2015లో వచ్చిన యాగవరైనమ్‌ నా కక్కా అనే సినిమాలో మొదటిసారి జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో స్నేహితులుగా మారిన ఈ ఇద్దరు తరువాత వచ్చిన మరగధ నాణ్యం చిత్రంతో ప్రేమికులయ్యారు. ఇక ఇపుడు పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. వివాహం తరువాత రెండురోజుల క్రితమే తిరుమల దర్శనం కూడా చేసుకున్నారు ఈ కొత్త జంట. అయితే వీరిది ప్రేమ వివాహం అయినప్పటికీ ఎక్కడ చూసినా కట్నం గురించే చర్చలు నడుస్తున్నాయి.

ఆది తీసుకున్న కట్నం ఎంతో తెలుసా…..

ఇక ఇపుడు సోషల్‌ మీడియాలో ఆది పెళ్లి కట్నం గురించే చర్చ జరుగుతోంది. ఎంత ప్రేమ వివాహం అయితే మాత్రం కట్నం తీసుకోకుండా ఎందుకు వుంటాడు? భారీగానే కట్నం తీసుకొని ఉంటాడని కొందరు నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కామెంట్లను ఆయన దగ్గరి సన్నిహితులు మాత్రం తోసిపుచ్చినట్లు సమాచారం. ఆది అసలు కట్నకానులకు పూర్తి వ్యతిరేకం అని, పెళ్లికి అతను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. అమ్మాయి వాళ్ళు అడిగినంత కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఆది వారిని సున్నితంగా వద్దు అని చెప్పారట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మాత్రం ఆది నిర్ణయానికి ఫిదా అవుతున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago