‘సిద్ శ్రీరామ్’ ఒక పాటకి ఎంత తీసుకుంటాడో తెలుసా..??

టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు సింగర్ లు కూడా హై రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నారు.. అందులో ముందు వరుసలో ఉండే గాయకులలో సిద్ శ్రీరామ్ ఒకరు.. ఈ మధ్యకాలంలో యూత్‌లో బాగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న సింగర్‌ ఆయన..ఇప్పటి సినిమాలలోపాటలకు కూడా చాలా ప్రత్యేకత చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు..ఈ నేపథ్యంలోనే సౌత్ లో ఉండే ఫేమస్ సింగర్స్ తో పాటలు పాడిస్తున్నారు..

ఇక ఈ మధ్య సిద్‌ శ్రీరామ్‌ పాట లేనిదే సినిమాలు లేవనడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ సినిమా యావరేజ్‌ టాక్‌ సంపాదించుకున్నా ఆయన పాట మాత్రం సూపర్‌ హిట్‌ అవుతోంది. కొన్నిసార్లు అయితే సిద్‌ శ్రీరామ్‌ పాడిన పాటలతోనే సినిమాపై హైప్‌ క్రియేట్‌ అవుతుంది. దీంతో ఆయనతో ఒక్క పాట అయినా పాడించాలని సంగీత దర్శకులు ఉవ్విళూరుతున్నారు.

తాజాగా ‘నీలినీలి ఆకాశం, ఒకే ఒక లోకం నువ్వు , మాటె వినధుగ..వినధుగ, ఏమై పోయావే’ వంటి పాటలు సిద్‌ శ్రీరామ్‌ పాడినవే. అయితే ఆ సినిమాల రిజల్ట్‌ ఎలా ఉన్నా సిద్‌ శ్రీరామ్‌ పాట మాత్రం​ హిట్‌ అవుతోండటంతో సినిమా ప్రమోషన్‌గా వాడేస్తున్నారు నిర్మాతలు.ఇక అల వైకుంఠపురమలోని ‘సామజవరగమనా’, గీత గోవిందంలోని ‘ఇంకెం ఇంకెం ఇంకెం కావాలే’ పాటలు బంపర్‌ హిట్‌గా నిలిచాయి.మరి ఇంత క్రేజ్‌ ఉన్న సిద్‌ శ్రీరామ్‌ తీసుకునే రెమ్యూనరేషన్‌కు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

సాధారణంగా సింగర్‌ను బట్టి 20 వేల నుంచి 50 వేలు, మహా అయితే 1.5లక్షల దాకా రెమ్యూనరేషన్‌ ఇస్తారట. అయితే సిద్‌ శ్రీరామ్‌కున్న మార్కెట్‌ను బట్టి ఆయనకు 4.5లక్షలు ఇస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. ఒక్క పాటకే ఆయన ఈ రేంజ్‌లో చార్జ్‌ చేయడం విశేషం. యూత్‌లో మంచి కక్రేజ్‌ ఉన్న సింగర్‌గా సిద్‌ శ్రీరామ్‌కు పేరుండటంతో ఆయన అడిగినంత ఇవ్వడంలో నిర్మాతలు వెనకడుగు వేయడం లేదని తెలుస్తోంది.మొత్తానికి స్టార్ హీరోలే కాదు సింగర్ లు కూడా రెమ్యూనరేషన్ ల పరంగా బాగానే సంపాదిస్తున్నారు..!!