తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలామంది నటులు ముందు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత అవకాశాలు రాక కమెడియన్ గా మారారు..అలాంటి వారిలో ఒకరు ప్రముఖ కమిడియన్ సుధాకర్ ఒకరు.. ఒకప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీని ఏలిన నటుడు సుధాకర్…దాదాపు 600 చిత్రాలలకు పైగా నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. మొదట ఇండస్ట్రీలో హీరోగా ప్రయాణం మొదలు పెట్టాడు. ఆ తరవాత కమెడియన్ గా సెటిల్ అయ్యారు.
అయితే అప్పట్లో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు చిరంజీవి సుధాకర్ హరిప్రసాద్ చెన్నైలో ఒకే రూమ్ లో ఉండేవారు. ఆ సమయంలో దర్శకుడు భారతీ రాజా సుధాకర్ కు ఛాన్స్ ఇచ్చారు. ఆలా సుధాకర్ ‘కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్’ అనే చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశారు.ఆ తర్వాత.. ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు సూపర్ హిట్లతో తమిళనాట స్టార్ హీరోగా మారిపోయారు. దాదాపు 45 చిత్రాల్లో హీరోగా నటించారు.
సుధాకర్ హీరో అయిన చాలా కాలం తర్వాత చిరంజీవికి అవకాశం వచ్చింది.ఆ తర్వాత ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్ కు తరలివచ్చింది. అయితే తమిళ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ ను అప్పటి రాజకీయ నాయకులు పార్టీలో చేరాలని కోరారు. అయితే ఆయనకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని చెప్పడంతో అక్కడి నాయకులు అతడు సినిమాలో రాణించకుండా అతడు చేసిన సినిమాలను రిజిల్ చేయకుండా అడ్డుకున్నారు.
ఈ క్రమంలోనే తెలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన ‘యముడికి మొగుడు’ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు సుధాకర్. నటుడిగానే కాకుండా.. పలు చిత్రాలను కూడా ఆయన నిర్మించారు. ఆ తర్వాత 2010లో అనారోగ్యానికి గురయ్యారు. బ్రెయిన్ స్ట్రోక్ తో దాదాపు 40 రోజులు కోమాలో ఉన్నారు. ఆ తర్వాత సుధాకర్ కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు..
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…