చెన్నై నుండి హీరోగా వచ్చిన సుధాకర్ టాలీవుడ్ లో మాత్రం కమెడియన్ గా ఎందుకు మారాడో తెలుసా..??

0
154

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలామంది నటులు ముందు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి.. ఆ తర్వాత అవకాశాలు రాక కమెడియన్ గా మారారు..అలాంటి వారిలో ఒకరు ప్రముఖ కమిడియన్ సుధాకర్ ఒకరు.. ఒకప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీని ఏలిన నటుడు సుధాకర్…దాదాపు 600 చిత్రాలలకు పైగా నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. మొదట ఇండస్ట్రీలో హీరోగా ప్రయాణం మొదలు పెట్టాడు. ఆ తరవాత కమెడియన్ గా సెటిల్ అయ్యారు.

అయితే అప్పట్లో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు చిరంజీవి సుధాకర్ హరిప్రసాద్ చెన్నైలో ఒకే రూమ్ లో ఉండేవారు. ఆ సమయంలో దర్శకుడు భారతీ రాజా సుధాకర్ కు ఛాన్స్ ఇచ్చారు. ఆలా సుధాకర్ ‘కిళుక్కెమ్ పోంగెమ్ రెయిల్’ అనే చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీలో తెరంగేట్రం చేశారు.ఆ తర్వాత.. ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు సూపర్ హిట్లతో తమిళనాట స్టార్ హీరోగా మారిపోయారు. దాదాపు 45 చిత్రాల్లో హీరోగా నటించారు.

సుధాకర్ హీరో అయిన చాలా కాలం తర్వాత చిరంజీవికి అవకాశం వచ్చింది.ఆ తర్వాత ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్ కు తరలివచ్చింది. అయితే తమిళ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధాకర్ ను అప్పటి రాజకీయ నాయకులు పార్టీలో చేరాలని కోరారు. అయితే ఆయనకు రాజకీయాలపై ఇంట్రెస్ట్ లేదని చెప్పడంతో అక్కడి నాయకులు అతడు సినిమాలో రాణించకుండా అతడు చేసిన సినిమాలను రిజిల్ చేయకుండా అడ్డుకున్నారు.

ఈ క్రమంలోనే తెలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన ‘యముడికి మొగుడు’ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు సుధాకర్. నటుడిగానే కాకుండా.. పలు చిత్రాలను కూడా ఆయన నిర్మించారు. ఆ తర్వాత 2010లో అనారోగ్యానికి గురయ్యారు. బ్రెయిన్ స్ట్రోక్ తో దాదాపు 40 రోజులు కోమాలో ఉన్నారు. ఆ తర్వాత సుధాకర్ కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here