పోస్టాఫీస్, పీపీఎఫ్ స్కీమ్స్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వారికి కేంద్రం శుభవార్త..?

దేశంలో చాలామంది రిస్క్ లేకుండా డబ్బులు దాచుకోవడానికి స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లో డిపాజిట్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. స్మాల్ సేవింగ్స్ స్కీమ్ లలో డిపాజిట్ చేయడం వల్ల ఎక్కువ వడ్డీని పొందే అవకాశం ఉండటంతో పాటు కచ్చితమైన లాభాలను పొందే అవకాశం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లలో కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉన్నా వాటిలో రిస్క్ శాతం ఎక్కువ.

కొన్ని సందర్భాల్లో మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే పెట్టుబడి కూడా రాకపోవడం జరుగుతుంది. కేంద్రం దేశంలోని ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఎన్నో పోస్టాఫీస్ స్కీమ్ లను అమలు చేయడంతో పాటు సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ స్కీమ్ లను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ లలో డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు కేంద్రం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వడ్డీ రేట్లపై సమీక్ష చేసిన కేంద్రం వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

ప్రతి 90 రోజులకు ఒకసారి కేంద్రం వడ్డీ రేట్లపై సమీక్ష నిర్వహించి వడ్డీ జమ చేస్తుంది. ప్రస్తుతం దేశంలో ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్లపై తక్కువ మొత్తం వడ్డీనే ఆఫర్ చేస్తున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు భారీగా తగ్గాయి. చాలామంది స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ల వడ్డీరేట్లు కూడా తగ్గుతాయని భావించినా కేంద్రం ఆ స్కీమ్ లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఈ నెల నుంచి 2021 మార్చి నెల వరకు ఇప్పటివరకు ఉన్న వడ్డీ రేటే వడ్డీ రేటుగా ఉంటుంది. మూడు నెలల తరువాత కేంద్రం మళ్లీ వడ్డీరేట్లపై సమీక్ష జరిపి వడ్డీరేట్లలో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పీపీఎఫ్ అకౌంట్ పై 7.1 శాతం, సుకన్య సమృద్ధి అకౌంట్‌పై 7.6 శాతం వడ్డీ లభిస్తోంది.