sonu sood interesting words about his political enrty

Sonu Sood : రాజకీయాల్లో ఎంట్రీ అప్పుడే అంటున్న సోనూసూద్… ఏ పార్టీలో చేరతారంటే ?

Sonu Sood : సోనూసూద్… ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు. కోట్లాది ప్రజల గుండెల్లో మనసు సంపాదించుకున్నగొప్ప వ్యక్తి. కరోనా రాకముందు వరకు ఆయన ఒక నటుడు మాత్రమే. ఆయన మనకు సినిమాల్లో నటించే ఒక విలన్ లాగానే కనిపించేవాడు. కానీ.. ఇప్పుడు ఆయన పెద్ద సెలబ్రిటీ. ఆయనకు ప్రస్తుతం ఉన్న ఫాలోయింగే వేరు. కరోనా కాలంలో నేనున్నాను అంటూ వేల మంది వలస కూలీలను తన సొంత ఖర్చులతో వాళ్ల స్వస్థలాలకు పంపించి గొప్ప మనసును చాటుకున్నాడు.

sonu sood interesting words about his political enrty
sonu sood interesting words about his political enrty

ఇప్పటికే పలుచోట్ల సూద్ కు గుళ్లు కట్టించారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బతండా పరిధిలోని చెలిమితండాలో రాజేశ్ రాథోడ్ సోనూసూద్ విగ్రహం ఏర్పాటు చేసి తన అభిమానాన్ని చాటాడు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్లకు చెందిన పండగ నవీన్, త్రివేణి దంపతులు పుట్టిన బిడ్డకు సోనూసూద్ అని పేరు పెట్టుకున్నారు. ఇలా ఎన్నో చోట్ల సోనూ సాయం పొందిన వారు ఆయనకు ఏదో ఒక రీతిలో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు.

sonu sood interesting words about his political enrty

సాధారణ పౌరులే కాకుండా సెలబ్రిటీలు కూడా సోనూసూద్ నుంచి సాయం పొందారు. అందుకే సినిమా సెట్స్ లో మెగాస్టార్, మోహన్ లాల్ లాంటి స్టార్స్ కూడా శాలువా కప్పి సోనూను ప్రత్యేకంగా సన్మానించారు. కాగా కాంగ్రెస్ తరఫున మోగా నుంచి పోటీ చేస్తున్న సోదరి మాళవికకు మద్దతుగా సోనూసూద్ ప్రచారం చేస్తున్నారు. దీంతో పంజాబ్‌లో కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఉన్నాయని అందరూ అభిప్రాయపడుతున్నారు.

ఆ పార్టీ లోనే చేరతాను : సోనూసూద్

ఈ సంధర్భంగా తన మనసులో మాటని బయటపెట్టాడు సోనూసూద్. మరో ఐదేళ్లపాటు సమాజ సేవపై దృష్టి పెట్టి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తానని సోనూసూద్ వెల్లడించారు. తన ఆలోచనలతో సారూప్యత ఉన్న పార్టీలో చేరతానని తెలిపారు. ఈ పదవికి నువ్వే అర్హుడివని అందరూ అనేస్థాయికి ఎదిగాక తప్పకుండా వస్తానని సోనూ చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తుండగా… మరి కొందరు మాత్రం నెగిటివ్ గా స్పందిస్తున్నారు. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో.