Sowcar Janaki : కల్మషం లేని వ్యక్తి.. మన ఇంట్లో కుటుంబ సభ్యుడిలా కనిపిస్తాడు.. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. : షావుకారు జానకి.

Sowcar Janaki : షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి అలనాటి రంగస్థల, సినీ కథానాయిక. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 380 కి పైగా సినిమాల్లో నటించింది. ఇందులో సుమారు 200కి పైగా కథానాయికగా నటించిన సినిమాలు. ఈమె రేడియో నాటికల ద్వారా కెరీర్ ప్రారంభించింది. తెలుగు, తమిళ భాషల్లో ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎం.జి.ఆర్, శివాజీ గణేశన్ మొదలైన నటుల సరసన కథానాయికగా నటించింది. ఈమె చెల్లెలు కృష్ణకుమారి కూడా సినీ నటి. 2022లో షావుకారు జానకి తమిళనాడు రాష్ట్రం తరపున పద్మశ్రీ పురస్కారానికి ఎన్నికయ్యారు.

Sowcar Janaki : కల్మషం లేని వ్యక్తి.. మన ఇంట్లో కుటుంబ సభ్యుడిలా కనిపిస్తాడు.. వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. : షావుకారు జానకి.

షావుకారు జానకి అనేక రంగస్థల నాటకాలలో కూడా నటించింది. తన 11 వయేటనే రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొంది. ఈమె మొట్టమొదటి చిత్రం “షావుకారు” ఈమె ఇంటి పేరైపోయింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మళయాళం సినిమాలోను నటించింది. తెలుగు కథానాయకి కృష్ణకుమారి ఈమెకు స్వయానా చెల్లెలు. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పనిచేసింది.

ఈమె సత్యసాయిబాబా భక్తురాలు.
విజయా ప్రొడక్షన్స్ వారి షావుకారు (1950) ఈమె మొదటి సినిమా. 1949లో రక్షరేఖ అనే సినిమాలో చంద్రికగా నటించింది. తరువాత ఆమె షావుకారు జానకి గా ప్రసిద్ధురాలయ్యింది. అప్పటి అందరు ప్రముఖ నాయకుల సరసన నటించింది. అనేక పురస్కారాలు పొందింది. తెలుగులో ఈమె సినిమాలలో ప్రసిద్ధమైనవి కొన్ని చిత్రాలు షావుకారు, డాక్టర్ చక్రవర్తి మంచి మనసులు, రోజులు మారాయి… అయితే ఓ ప్రముఖ ఛానల్ కు షావుకారు జానకి ఇంటర్వ్యూ ఇస్తూ.. మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో ఏ ఇంటిలో ఆపద వచ్చినా ఆ ఇంటి గడప తొక్కే మొదటి వ్యక్తిగా ఉంటారని ఆయనతో ఎన్నో సినిమాలు చేశారు.

చిరంజీవితో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని యాంకర్ అడగడంతో.. అవును నేను చిరంజీవిగారితో “తాయరమ్మ బంగారయ్య” వంటి చిత్రాల్లో నటించానని.. ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తారు. డౌన్ టు ఎర్త్ , వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆయన కెరీర్ బిగినింగ్ లో నెగటివ్ రోల్స్ చేశారని ఆ తర్వాత ఆయన చేసిన క్యారెక్టర్స్ ఎదిగిన విధానం బాగుందని ఐ ఆల్వేస్ అడ్మైర్ హిమ్ అంటూ.. చిరంజీవి సినీ గమనంలో ఆయనా సాధించిన విజయాలు, సహాయం చేసిన విధానాల గురించి షావుకారు జానకి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.