Movie News

Manjula : చిన్న దెబ్బే అనుకున్నారు.. ఆ అలసత్యవమే నటి మంజుల ప్రాణాలు తీసింది.!

అలనాటి తార మంజుల విజయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నటుడు విజయ్ కుమార్ ను పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. వారు వనిత, ప్రీతి, శ్రీదేవి. ఇక మంజుల పెద్ద కుమార్తె వనిత గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక శ్రీదేవి కూడా పలు సినిమాలలో నటించి బాగా గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మంజుల చనిపోయేటప్పుడు ఎలాంటి నరకం అనుభవించారో తెలిస్తే కన్నీళ్లు ఆగవు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా నటి మంజుల పెద్ద కుమార్తె వనిత ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. నటి మంజుల ఇంట్లో కిందపడి మృతి చెందిందని ఇంటర్వ్యూ సందర్భంగా వనిత తెలియజేశారు.

2013వ సంవత్సరంలో మంజుల ఇంట్లో కింద పడటంతో తన నుదిటిపై కొద్దిగా వాపు ఏర్పడిందని, అయితే ప్రమాదం ఏమీ జరగలేదు కొద్దిగా పెయిన్ బాంబ్ రాసుకుంటే సరిపోతుందని భావించారు. అయితే అమ్మ కింద పడినప్పుడు కడుపుకి బలంగా దెబ్బ తగలడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యేదని దాని ఫలితంగా రక్తం గడ్డ కట్టి కిడ్నీలపై అధిక ప్రభావం చూపిందని ఆమె తెలిపారు.

అమ్మ కింద పడిన నెలరోజులకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ కి తీసుకు వెళ్తే వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు మరో మూడు రోజులలో అమ్మ చనిపోతుందని షాకింగ్ విషయాన్ని చెప్పారు. డాక్టర్ చెప్పే మాటలు అమ్మవిని నా పరిస్థితి నాకు అర్థం అవుతోందని వనితతో చెప్పారు. ఇక అప్పటి నుంచి అమ్మ పరిస్థితి రోజురోజుకు చాలా క్షీణించిపోయింది.

ఈ విషయం ఇంట్లోవారికి ఎలా చెప్పాలా అని కంగారుపడ్డాను ఇక అమ్మ పరిస్థితి మరింత క్షీణించి పోవడంతో అమ్మని ఐసియుకి షిఫ్ట్ చేశారు. రెండు రోజుల పాటు హాస్పిటల్ లో ఉండటం వల్ల తన తండ్రి వనితను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నారు.అయితే అమ్మ హాస్పిటల్ లో ఎవరిని చూసినా వనితా అని పిలవడంతో విజయ్ కుమార్ అమ్మ ఏ క్షణాన్నైనా మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చు నిన్నే కలవరిస్తుంది ఒకసారి హాస్పిటల్ కి వచ్చేసేయ్ అని చెప్పారు. ఆ విధంగా హాస్పిటల్ కి వెళ్ళగానే అమ్మ తనని చూసి తన చేతిలోనే ప్రాణాలు విడిచిందని తన తల్లి మరణం గురించి తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago