Manchu Lakshmi : మంచు వారసురాలిగా మనోజ్, విష్ణులతో పాటు తనదైన స్టైల్ తో తెలుగు సినీ పరిశ్రమలో రానిస్తోంది. నటిగానే కాకుండా టీవీ ప్రోగ్రాములతోటి కూడా అభిమానులను అలరించింది. అయితే చాలా కాలంగా కాస్త నటనకు దూరంగా ఉందనే చెప్పాలి. ప్రస్థుతం నిర్మాతగా వ్యవహరిస్తోంది. అయితే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎపుడు ఏవో ఒక పోస్టులు చేస్తూ యాక్టీవ్ గా ఉంటుంది. కానీ లక్ష్మి పెట్టే పోస్టులకు ప్రశంసించే వారితో పాటు విమర్శించే వారు కూడా ఎక్కువగానే వుంటారు. తాజాగా లక్ష్మి పెట్టిన ఒక పోస్ట్ కు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
షో ఆఫ్ చేస్తున్నావ్….
తాజాగా మంచు లక్ష్మి చేసిన ఓ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మంచు లక్ష్మ తన ఇంట్లో ఉన్న షూ రాక్ ముందు కూర్చొంది. తన ముందు కొన్ని జతల షూస్ వేసుకొంది. దానికి ఆమె నెవర్ హ్యావ్ ద రైట్ షూ అని క్యాప్షన్ కూడా పెట్టింది. అంటే నాకు సరైన షూ ఎప్పటికీ లేదు అంటూ పోస్టు చేసింది. ఇక ఈ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్స్ వారికి తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.
దీనిపై స్పందించిన ఓ నెటిజన్ కాళ్ళు కాలే కాళ్ళు ఒకచోట అంటూ కామెంట్ చేశాడు. ఇంకొకరు లెక్క లేనన్ని జోల్లు ఒక చోటు అంటూ కామెంట్ పెట్టాడు. మరో నెటిజన్ కొత్త షాపు ఓపెన్ చేశారా…కాంగ్రాట్స్ అంటూ పోస్ట్ చేశాడు. మంచు లక్ష్మీ షో ఆఫ్ చేస్తుందని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ అయితే ‘నీకు భగవంతుడు ఇన్ని రకాల షూస్ ఇచ్చాడు. నువ్వు వాడనప్పుడు వాటిని ఓ జత కూడా చెప్పులు లేని నిరు పేదలకు ఇవ్వొచ్చు కదా’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఇలా నెటిజన్లు తమదైనా రీతిలో స్పందించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…