Singitham Srinivasa Rao : సింగీతం శ్రీనివాసరావు గారి ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి మరణించారు. పుష్పక విమాన లాంటి మూకీ సినిమాను కమర్షియల్ సినిమాల టైములో తీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు. హిట్ సినిమాల హవా నడుస్తున్న సమయంలో అలాంటి సినిమా వద్దని ఎందరు వాయించిన భార్య ప్రోత్సాహంతో తీసి హిట్ పొందారు. 1960 లో లక్ష్మి కళ్యాణి గారిని పెళ్లి చేసుకున్న సింగీతం, అప్పటికి ఆవిడ ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారవటంతో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో సింగీతం గారికి సహాయం చేసేవారు.
శ్రీ కళ్యాణియం పుస్తకం …..
ఇక వీరి వైవాహిక జీవితం గురించి శ్రీ కళ్యాణియం అనే పుస్తకాన్ని రచించారు. అప్పట్లో మంచి ఆదరణ పొందింది. శనివారం 9గంటల 10నిమిషాలకు చెన్నైలోని తమ స్వగృహంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని అధికారికంగా సింగీతం గారు సోషల్ మీడియా ద్వారా చెప్పారు. 42 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆదివారం నాడు అంత్యక్రియలు జరగనున్నాయి.
సింగీతం శ్రీనివాసరావు గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ప్రభాస్ ప్రాజెక్ట్ కే కోసం డైరెక్టర్ నాగ అశ్విన్ సింగీతం గారిని సలహాదారుగా పెట్టుకున్నారు. తొలుత ఒప్పుకున్నా వయో భారం కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి సింగీతం శ్రీనివాసరావు గారు తప్పుకున్నారు. ఈ ప్రాజెక్ట్ టైం ట్రావెల్ కి సంబంధించింది కావడంతో ఇంతకు ముందు సింగీతం ఆదిత్య 369 వంటి టైం మెషిన్ కాన్సెప్ట్ సినిమాలు చేయడం వల్ల అయనను ప్రాజెక్టులో భాగం చేయాలనుకున్నారు.
నవజాత శిశువుల సంరక్షణలో మసాజ్ ఒక ముఖ్యమైన భాగంగా భావించబడుతోంది. భారతీయ కుటుంబాల్లో ఇది తరతరాలుగా కొనసాగుతున్న అలవాటు అయినప్పటికీ,…
తెలుగు సినీ రంగంలో తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి ఆమని, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర…
ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్‌గా మారుతోంది. ముఖ్యంగా…
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…
వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్‌లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…