Featured

Rashmika Vs Yash : టంగ్ స్లిప్ అయిన కారణంగా… యష్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పుకున్న రష్మిక

Rashmika Mandanna : కన్నడ సూపర్ స్టార్ యష్ అంటే ఇపుడు తెలియని వాళ్ళు వుండరు. కేజీఫ్ చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు యష్. ఇంకోవైపు కన్నడ నుంచి వచ్చిన రష్మిక కూడా పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజీ హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రేజీ హీరయిన్ టంగ్ స్లిప్ అవ్వడం, తరువాత యష్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పడం జరిగింది. అయితే ఇపుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

యష్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన రష్మిక…..

సినిమా ఇండస్ట్రీ లో సెలబ్రిటీలు అపుడప్పుడు వేరొకరిమీద టంగ్ స్లిప్ అవ్వడం మామూలుగా జరుగుతుంటుంటుంది. అలాంటప్పుడు ఫ్యాన్స్ నుంచి భారీగా ట్రోల్ల్స్ కి గురి అవ్వడం, తరువాత వారికి మీడియా ద్వారా క్షమాపణలు చెప్పడం కూడా మామూలే. ఇక ఇలాంటిదే రష్మిక కూడా ఎదుర్కొంది. కాకపోతే ఇపుడు కాదు 2017 లో రష్మిక నటించిన కిరాక్ పార్టీ ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు. మీడియా నుండి కన్నడ ఇండస్ట్రీలో ‘మిస్టర్ షోఆఫ్’ ఎవరు? అనే ప్రశ్న ఎదురవగా రష్మిక టక్కున యష్ పేరు చెప్పింది. దాంతో తీవ్రంగా హర్ట్ అయిన యష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రష్మికను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఆ ట్రోలింగ్ భరించలేక రష్మిక సోషల్ మీడియా పోస్టులో యష్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెబుతూ వివరణ ఇచ్చింది.

యష్ సర్ ని నేను ఆ ఉద్దేశంతో అనలేదు. వీడియో చూడకుండా అలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. యష్ సర్ నాకు ఎన్నోసార్లు స్ఫూర్తి అని చెప్పాను. ఆయన నటించిన సినిమాలలో నాకు ‘సంతూ స్ట్రయిట్ ఫార్వర్డ్’ మూవీ అంటే చాలా నచ్చుతుంది అంటూ యష్ ఫ్యాన్స్ ని కూల్ చేసింది. కాకపోతే ఎప్పుడో జరిగిపోయిన ఈ సంఘటన ఇపుడు ఎందుకు హాట్ టాపిక్ అయ్యిందో కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

Bhargavi

Recent Posts

పాడె మోసే ప్రతి అడుగు పుణ్యమా? ఈ నమ్మకాల వెనుక అసలు కథ ఇదే!

మానవ జీవితంలో మరణం అనివార్యమైన ఘట్టం. ఈ సందర్భాల్లో మృతదేహాన్ని మోయడం అనేది సాధారణంగా కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు…

6 minutes ago

పూజ చేస్తున్నా ఫలితం లేదా? పూజలో ఈ చిన్న తప్పులు చేస్తే ఫలితం రాదు.. జాగ్రత్త!

ప్రతిరోజూ భక్తితో పూజలు చేస్తున్నా జీవితంలో ఆశించిన మార్పులు కనిపించకపోవడం చాలా మందిని ఆలోచనలో పడేస్తుంది. దీని వెనుక కారణాలు…

14 minutes ago

స్వీట్ తిన్న 30 నిమిషాల్లో శరీరంలో జరిగేది ఇదే.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

తీపి పదార్థాలు తిన్న వెంటనే మనకు ఉత్సాహం పెరిగినట్లు అనిపించడం సహజం. చాక్లెట్, స్వీట్లు తీసుకున్న కొన్ని నిమిషాల్లోనే శరీరంలో…

23 minutes ago

ఈ వింత పండు గురించి తెలుసా? ఆరోగ్యానికి అద్భుతమైన నోని ప్రయోజనాలు!

ప్రకృతిలో లభించే పండ్లలో కొన్నివి చూసేందుకు విచిత్రంగా కనిపించినా, వాటి లోపల దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి.…

31 minutes ago

లక్షణాలు లేకుండా పెరుగుతున్న వ్యాధులు… జాగ్రత్త!

ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సాధారణంగా నొప్పి, జ్వరం వంటి సంకేతాలు కనిపిస్తాయని అనుకుంటాం. అయితే కొన్ని వ్యాధులు ఎలాంటి స్పష్టమైన…

41 minutes ago

చిన్న పండు… పెద్ద లాభాలు! ఎముకలు బలంగా, చర్మం మెరిసేలా… ఈ పండు సీక్రెట్

వేసవి కాలంలో లభించే అరుదైన పండ్లలో పాల పండు ఒకటి. చాలా మందికి ఈ పండు గురించి పెద్దగా తెలియకపోయినా,…

48 minutes ago