Rashmika Mandanna : కన్నడ సూపర్ స్టార్ యష్ అంటే ఇపుడు తెలియని వాళ్ళు వుండరు. కేజీఫ్ చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు యష్. ఇంకోవైపు కన్నడ నుంచి వచ్చిన రష్మిక కూడా పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజీ హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రేజీ హీరయిన్ టంగ్ స్లిప్ అవ్వడం, తరువాత యష్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెప్పడం జరిగింది. అయితే ఇపుడు ఇది హాట్ టాపిక్ గా మారింది.

యష్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన రష్మిక…..
సినిమా ఇండస్ట్రీ లో సెలబ్రిటీలు అపుడప్పుడు వేరొకరిమీద టంగ్ స్లిప్ అవ్వడం మామూలుగా జరుగుతుంటుంటుంది. అలాంటప్పుడు ఫ్యాన్స్ నుంచి భారీగా ట్రోల్ల్స్ కి గురి అవ్వడం, తరువాత వారికి మీడియా ద్వారా క్షమాపణలు చెప్పడం కూడా మామూలే. ఇక ఇలాంటిదే రష్మిక కూడా ఎదుర్కొంది. కాకపోతే ఇపుడు కాదు 2017 లో రష్మిక నటించిన కిరాక్ పార్టీ ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు. మీడియా నుండి కన్నడ ఇండస్ట్రీలో ‘మిస్టర్ షోఆఫ్’ ఎవరు? అనే ప్రశ్న ఎదురవగా రష్మిక టక్కున యష్ పేరు చెప్పింది. దాంతో తీవ్రంగా హర్ట్ అయిన యష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రష్మికను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఆ ట్రోలింగ్ భరించలేక రష్మిక సోషల్ మీడియా పోస్టులో యష్ ఫ్యాన్స్ కి క్షమాపణలు చెబుతూ వివరణ ఇచ్చింది.

యష్ సర్ ని నేను ఆ ఉద్దేశంతో అనలేదు. వీడియో చూడకుండా అలా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. యష్ సర్ నాకు ఎన్నోసార్లు స్ఫూర్తి అని చెప్పాను. ఆయన నటించిన సినిమాలలో నాకు ‘సంతూ స్ట్రయిట్ ఫార్వర్డ్’ మూవీ అంటే చాలా నచ్చుతుంది అంటూ యష్ ఫ్యాన్స్ ని కూల్ చేసింది. కాకపోతే ఎప్పుడో జరిగిపోయిన ఈ సంఘటన ఇపుడు ఎందుకు హాట్ టాపిక్ అయ్యిందో కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.






























