Singitham Srinivasa Rao : సింగీతం శ్రీనివాసరావు గారి ఇంట విషాదం నెలకొంది. ఆయన సతీమణి మరణించారు. పుష్పక విమాన లాంటి మూకీ సినిమాను కమర్షియల్ సినిమాల టైములో తీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారు. హిట్ సినిమాల హవా నడుస్తున్న సమయంలో అలాంటి సినిమా వద్దని ఎందరు వాయించిన భార్య ప్రోత్సాహంతో తీసి హిట్ పొందారు. 1960 లో లక్ష్మి కళ్యాణి గారిని పెళ్లి చేసుకున్న సింగీతం, అప్పటికి ఆవిడ ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారవటంతో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో సింగీతం గారికి సహాయం చేసేవారు.

శ్రీ కళ్యాణియం పుస్తకం …..

ఇక వీరి వైవాహిక జీవితం గురించి శ్రీ కళ్యాణియం అనే పుస్తకాన్ని రచించారు. అప్పట్లో మంచి ఆదరణ పొందింది. శనివారం 9గంటల 10నిమిషాలకు చెన్నైలోని తమ స్వగృహంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని అధికారికంగా సింగీతం గారు సోషల్ మీడియా ద్వారా చెప్పారు. 42 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఆదివారం నాడు అంత్యక్రియలు జరగనున్నాయి.
Mrs. Kalyani w/o Director Singeetam Srinivasa Rao attained the lotus feet of Sai Baba.
— R.S.Shivaji (@rsshivaji) May 29, 2022
Saipa bless your departed soul mam.
Prayers ????Om Sairam Om Shanthi.
Heartfelt condolences to Singeetam Sir, Poorna, Satish and their family members. pic.twitter.com/FNJ8mmcWXy
సింగీతం శ్రీనివాసరావు గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ప్రభాస్ ప్రాజెక్ట్ కే కోసం డైరెక్టర్ నాగ అశ్విన్ సింగీతం గారిని సలహాదారుగా పెట్టుకున్నారు. తొలుత ఒప్పుకున్నా వయో భారం కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి సింగీతం శ్రీనివాసరావు గారు తప్పుకున్నారు. ఈ ప్రాజెక్ట్ టైం ట్రావెల్ కి సంబంధించింది కావడంతో ఇంతకు ముందు సింగీతం ఆదిత్య 369 వంటి టైం మెషిన్ కాన్సెప్ట్ సినిమాలు చేయడం వల్ల అయనను ప్రాజెక్టులో భాగం చేయాలనుకున్నారు.

































