Stars & Restaurants : బార్ అండ్ రెస్టారెంట్స్ నడుపుతున్న మన తెలుగు తారలు వీళ్ళే…

Stars & Restaurants : ఒకప్పుడు నటులంటే కేవలం సినిమాలో నటించడం వచ్చిన డబ్బును పొదుపు చేసుకోవడం లేదంటే జల్సా చేసి ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్న దాఖలాలు ఎన్నో అయితే ఇప్పుడు కాలం మారింది ఆలోచన మారింది. ఒక పని చేస్తే వచ్చే డబ్బు మన జీవన సరలికి అలాగే సరిపోవడం లేదని భావిస్తున్న చాలా మంది యువత ఒకే సమయంలో రెండు చేతులా సంపాదించాలని భావిస్తున్నారు. ఈ విషయంలో సినిమా తారలు మినహాయింపు కాదు. ఒకవైపు సినిమాలను చేస్తూనే మరోవైపు ఇతర వ్యాపారాలను చేస్తున్నారు. అలా ఫుడ్ అలాగే బార్ బిజినెస్ చేస్తున్న మన సెలబ్రిటీలు ఎవరో తెలుసా…

అల్లు అర్జున్ నుండి మహేష్ వరకు అందరూ హోటల్స్…

ఏ సీజన్ తో పనిలేకుండా రుచి నచ్చితే లాభాలను అందించే హోటల్ బిజినెస్ ను మన సెలబ్రిటీస్ కూడా చేస్తున్నారు. సై సినిమా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న శశాంక్ ఆ తరువాత సహాయక పాత్రల్లో నటిస్తూ కనిపిస్తున్నా హైదరాబాద్ లో మాయాబజర్ పేరుతో ఒక హోటల్ రన్ చేస్తున్నాడు. ఈ హోటల్ ఆవరణం అంతా సినిమా స్టైల్ లో చేసి వచ్చే కస్టమర్స్ ను ఆకట్టుకుంటున్నారు. అంతే కాక మొఘలాయ్ ఫుడ్ కి ఇది ఫేమస్. ఇక మరో హీరో నవదీప్ కి పబ్స్ ఉన్న సంగతి తెలిసిందే. బీట్స్ పర్ మినిట్ పేరుతో పార్టీ ప్లేస్ నిర్వహిస్తున్నాడు. ఇక యువ హీరో శర్వానంద్ కూడా బీంజ్ పేరుతో కాఫీ షాప్ ను నడుపుతున్నాడు. ఇక్కడ పల్లెటూరి సెటప్ తో పాటు బజ్జి, సమోసా కాఫీ బాగా ఫేమస్.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా సినిమా కాకుండా ఇతర బిజినెస్ లో అడుగుపెట్టాడు. హై లైఫ్ పబ్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్న బన్నీ అది కాకుండా స్పోర్ట్స్ బార్ ఫ్రాంచైజ్ అయిన బి డబ్స్ లో పార్టనర్ గా ఉన్నాడు. ఇక అక్కినేని నాగార్జున ఎన్ గ్రిల్స్ రెస్టారెంట్ అలాగే ఎన్ ఆసియన్ నిర్వహిస్తుంటే కొడుకు నాగచైతన్య షోయు అనే పేరుతో రెస్టారెంట్ నడుపుతున్నారు. ఇక మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా తమిలనాడు ఫేమస్ జూనియర్ కుప్పన్న ఫ్రాంచైజ్ తీసుకుని నిర్వహిస్తున్నారు. ఇక డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఉలవచారు ఫ్రాంచైజ్ తీసుకుని ఆ రెస్టారెంట్ నిర్వహిస్తుండగా, హీరో సందీప్ కిషన్ కూడా వివాహ భోజనంబు అనే రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఇక ఎస్ ఎస్ కార్తికేయ కూడా సర్క్యూట్ పేరుతో ఒక రెస్టారెంట్ ను నడుపుతున్నారు. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఈ ఫుడ్ బిజినెస్ లోకి వచ్చిన సంగతి మనకు తెలిసినదే.