శుభలేఖ సుధాకర్ సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవారో తెలుసా?

కమెడియన్ గా తన కెరీర్ ను మొదలు పెట్టిన శుభలేఖ సుధాకర్ తర్వాత క్యారెక్టర్ అర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించారు. రకరకాల పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు.
నిజానికి “శుభలేఖ” ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు సూరావఝుల సుధాకర్. ఈయన నటించిన శుభలేఖ చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు.

కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రంలో చిరంజీవి – సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ , తులసి మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ , తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో జంటగా నటించారు. ఆ తరువాత తెలుగు, తమిళ టీవీ సీరియల్స్ లో నటించాడు. 1960 లో జన్మించిన సుధాకర్.. ముగ్గురు అన్నాదమ్ముళ్లలో పెద్దవాడు.

అతడు బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, గాయని ఎస్.పి.శైలజ ను పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. సినిమాల్లోకి రాకముందు అతడు ఓ హెటల్లో రిసెప్ష‌నిస్టుగా పనిచేశారు. అతడు సినిమాల్లోకి రావడానికి ముఖ్య కారణం.. 13 ఏళ్ల వయస్సులో ‘దీవార్‌’ సినిమా చూసిన సుధాకర్..ఎలాగైనా నటుడు కావాలనే ఆలోచనతోనే ఉండేవాడట. తర్వాత ఎలాగైనా ఇంట్లో వాళ్లను ఒప్పించి మ‌ద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో యాక్టింగ్‌లో డిప్లొమా తీసుకున్న త‌ర్వాత వైజాగ్ వెళ్లారు.

ఆ సమయంలోనే అతడు కె. విశ్వ‌నాథ్ ‘స‌ప్త‌ప‌ది’ షూటింగ్ చేస్తుండగా కలిశారు. కానీ అతడి ప్రయత్నం ఫలించలేదు. ఇలా సినిమా అవకాశాల కోసం ప్రయత్నింస్తుండగా.. తాజ్ కోర‌మాండ‌ల్‌లో ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నిస్తే.. రిసెప్ష‌నిస్ట్‌గా చేర‌మ‌న్నారు. అలా అక్కడ ఉద్యోగం చేస్తుండగానే విశ్వనాథ్ నుంచి కబురు రాగా.. శుభలేఖ సినిమాలో నటించారు. తర్వాత అతడి పేరు శుభలేఖ సుధాకర్ గా మారిపోయింది. క‌మ‌ల్ హాస‌న్‌ ‘ద్రోహి’ సినిమాలో అయితే నెగ‌టివ్ రోల్ పోషించారు సుధాకర్.