Sukumar: లైవ్ లో అభిమాని మీద సీరియస్ అయిన సుకుమార్.. వైరల్ అవుతున్న వీడియో…?

Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా గుర్తింపు పొందిన వారిలో సుకుమార్ కూడా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన సుకుమార్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. అయితే సుకుమార్ దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయితే మరికొన్ని మాత్రం డిజాస్టర్ గా మిగిలాయి.

ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే గతంలో సుకుమార్ దర్శకత్వం వహించిన వన్ నేనొక్కడినే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. సాధారణంగా సుకుమార్ సినిమాలు ప్రేక్షకులకు తొందరగా అర్థం కావు. కానీ ఆ సినిమాలను అర్థం చేసుకుంటే సినిమాలో అంత మంచి కథ దాగి ఉందా అని అనిపిస్తుంది. ఇలా మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమా కూడా మన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ విదేశాలలో మాత్రం ఈ సినిమా అధిక సంఖ్యలో కలెక్షన్లు వసూలు చేసింది.

ఎప్పుడు తన లెక్కల ప్రకారం సినిమాలో తీసే సుకుమార్ ఈ సినిమా ప్లాప్ అయిన తర్వాత తన దారి మార్చుకొని మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కూడా సినిమాల తీయాలని నిర్ణయించుకున్నారు.ఇదిలా ఉండగా వన్ నేనొక్కడినే సినిమా మన తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ హాలీవుడ్ సినిమాల అభిరుచి ఉన్న క్లాస్ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా చాలా నచ్చింది. అయితే అప్పట్లో సుకుమార్ వన్ నేనొక్కడినే ప్రమోషన్ లో భాగంగా ఓ లైవ్ లో పాల్గొన్నారు.

ఆ లైవ్ లో అమెరికాలో ఉండే ఎన్నారై కాల్ చేసి.. సుకుమార్ తో మాట్లాడుతు రివేంజ్ సినిమాకి సైకలాజికల్ ప్రాబ్లమ్ పెట్టడం సినిమాకి మైనస్ అని, కథలో లోపాలు ఉన్నాయని, అంతే కాకుండా స్టోరీలో దమ్ము లేనప్పుడు ఏ దేశంలో సినిమా తీసిన జనాలు చూడరని, నాకైతే ఈ సినిమా తలనొప్పిలా అనిపించిందని సదరు కాలర్ అన్నారు.

Sukumar: క్షమాపణలు చెప్పిన సుకుమార్…

ఇక ఆ కాలర్ మాటలకు కుమార్ స్పందిస్తూ చాలా సీరియస్ అయ్యాడు. మీ ఒక్కరి ఆలోచన విధానాన్ని అందరి మీద రుద్దటం సరికాదని, సినిమా గురించి బయట టాక్ ఎలా ఉందో ఒకసారి బయటికి వెళ్లి కనుక్కున్న తర్వాత మళ్లీ నాకు ఫోన్ చేయండి అంటూ సుకుమార్ వెల్లడించాడు. అయితే ఈ సినిమా ఒకసారి మీరు బయట వ్యక్తుల రెస్పాన్స్ చూసి మాట్లాడండి అంటూ కాస్త సీరియస్ గా స్పందించారు. ఆ తర్వాత సుకుమార్.. సుకుమార్ లైవ్ లోనే అతనికి క్షమాపణలు కూడా చెప్పారు 2014లో డిలీట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.