Super star Krishna : టాలీవుడ్ లో కొత్త ట్రెండ్లను సెట్ చేసిన సూపర్ స్టార్.. విలన్ గా చేసిన సినిమా ఏదో తెలుసా..!

Super star Krishna : ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టినా సూపర్ స్టార్ కృష్ణ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. 1965 లో తేనెమనసులు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బుర్రిపాలెం చిన్నోడు తెలుగు తెరకు కొత్తదనాన్ని పరిచయం చేసాడు. హాలీవుడ్ ట్రెండ్ ను టాలీవుడ్ కి రుచి చూపించాడు. తెలుగు పరిశ్రమలో కొత్తగా ఏదైనా రిస్క్ చేయాలన్నా అది కృష్ణ గారే చేయాలి అనేంత పేరు తెచ్చుకున్నారు ఈ నట శేఖరుడు. ఇక పండంటి కాపురం, పచ్చని సంసారం వంటి కుటుంబ కథ చిత్రాలలో నటించి మెప్పించారు. ఇక పండంటి కాపురం సినిమాకు నేషనల్ అవార్డు కూడా వరించింది.

విలన్ గాను మెప్పించిన సూపర్ స్టార్….

హాలీవుడ్ స్టైల్ మేకనస్ గోల్డ్ నేపథ్యంలో చిత్రాలకు పేరొందిన కౌ బాయ్ సినిమాలను తెలుగు తెరకు పరిచయం చేసారు. మోసగాళ్ళకు మోసగాళ్లు సినిమా ద్వారా కౌ బాయ్ సినిమా తీసి తెలుగులో కొత్త చిత్రాలకు నాంది పలికిన కృష్ణ. కె విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన ప్రైవేట్ మాస్టారు సినిమాలో సుతిమెత్తగా విలనిజం చూపించి నటనలో ఒక మెట్టు పైకి ఎక్కారు. ఈ సినిమాలో మరో విశేషం ఈ సినిమాలో శోభన్ బాబు కూడా చిన్న పాత్రలో నటించారు.

ఇక తరువాతి రోజుల్లో వీళ్లిదరు టాప్ హీరోస్ గా అనేక సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. ఇద్దరు కలిసి కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఇక కృష్ణ గారు తెలుగులో మొదటి కలర్ సినిమా, మొదటి 70 ఎమ్ ఎమ్ స్క్రీన్ సినిమాలను పరిచయం చేసారు. అంతే కాదు మహేష్ బాబు లాంటి అందగాడైన హీరోను తెలుగు సినిమాకు ఇచ్చారు. మహేష్ బాబు కూడా ప్రస్తుతం టాప్ హీరోగా ఉన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం వయసు రీత్యా కృష్ణ గారు ఇంటికే పరిమితమై ఆయన కొడుకు సినిమాలను ప్రమోట్ చేస్తూ ఉంటారు. దాదాపుగా 350 సినిమాల్లో నటించిన సూపర్ కృష్ణ, ఒక ఏడాదిలో 28 సినిమాలను విడుదల చేసిన రోజులు కూడా ఉన్నాయి. రోజుకి మూడు షిఫ్టులలో పనిచేసి సినిమాలను పూర్తి చేసిన కృష్ణ గారిని చూస్తే మీ ఎనర్జీకి డెడికేషనకి టేక్ ఏ బౌ అనాల్సిందే. అందుకే భారత ప్రభుత్వం ఆయనను 2009 లో పద్మ భూషణ్ తో సత్కరించింది.