Super Star Krishna : సన్యాసి వేషం.. ఓ డ్యూయెట్ లేదు.. ఫైట్ లేదు.. ఆ సినిమా ఎలా ఆడుతుంది బ్రదర్ వద్దన్నారు ఆ స్టార్ హీరో. : సూపర్ స్టార్ కృష్ణ.

Super Star Krishna : అల్లూరి సీతారామరాజు ఘట్టమనేని కృష్ణ కథానాయకునిగా 1974లో విడుదలైన తెలుగు సినిమా. ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజన విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మించిన బయోపిక్. సినిమాలో కృష్ణ, విజయనిర్మల, కొంగర జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించగా, ఘట్టమనేని హనుమంతరావు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు నిర్మించారు.

చిత్ర కథ ప్రకారం బ్రిటీష్ పరిపాలన పట్ల చిన్ననాటి నుంచీ వ్యతిరేకత పెంచుకున్న రామరాజు దేశాటన చేసి ప్రజల కష్టాలు, పోరాటాలు తెలుసుకుంటాడు. సీత అనే అమ్మాయిని ప్రేమించి, దేశసేవ కోసం పెళ్ళి చేసుకోకపోవడంతో ఆమె మరణించగా ఆమె పేరులోని సీతను స్వీకరించి సీతారామరాజు అవుతాడు. ఆపైన మన్యం ప్రాంతంలో గిరిజనులపై బ్రిటీష్ వారి దోపిడీకి వ్యతిరేకంగా సీతారామరాజు నేతృత్వంలో, గంటందొర, మల్లుదొర వంటి స్థానిక వీరుల మద్దతుతో ప్రజా విప్లవం ప్రారంభమవుతుంది. బ్రిటీష్ వారు ప్రజలను హింసించడం తట్టుకోలేక సీతారామరాజు లొంగిపోయి మరణించడంతో సినిమా ముగుస్తుంది.

సినిమాను ప్రధానంగా హార్సిలీ హిల్స్ ప్రాంతంలో తెరకెక్కించారు. సినిమా స్కోప్లో నిర్మాణమైన చిత్రంగా అల్లూరి సీతారామరాజు పేరొందింది. ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం, ఆఫ్రో-ఏషియన్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శన-బహుమతి వంటివి పొందింది. ఆ మధ్యకాలంలో సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ..”దేవుడు చేసిన మనుషులు” చిత్రం తర్వాత నిర్మాత డిఎల్ నారాయణ ఒకసారి తనకు వద్ద వచ్చి నా కాల్ షీట్స్ కావాలని అడిగారు.

శోభన్ బాబుతో “అల్లూరి సీతారామరాజు” చిత్రాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. కొత్త కథ ఎందుకు అల్లూరి సీతారామరాజు సినిమా నాతో తీస్తే ఏంటి అని అడగడంతో ఆ సినిమా చాలా ఖర్చుతో కూడుకున్న పని ఆ ప్రయత్నం చేయలేకనే ఆ సినిమా కథని పక్కకు పడేసానని చెప్పారు. అవసరమైతే ఆ కథ మీకు ఇస్తాను మీరు సినిమా చేసుకోండని డిఎల్ నారాయణ కృష్ణతో అన్నారు.

ఆ తర్వాత కృష్ణ రచయిత మహారథిని కలిసి విషయం చెప్పడంతో.. ఆయన ఇచ్చే కథ మనకెందుకు మనమే కొత్తగా అల్లూరి సీతారామరాజు కథ తయారు చేసుకుని సినిమా మొదలుపెడదాం అనడంతో.. మా సొంత బ్యానర్, వి.రామచందర్రావు దర్శకత్వంలో సినిమా తీయడానికి ఒక అంగీకారానికి వచ్చాం. ఆ సమయంలో విషయం తెలుసుకున్న ఎన్టీ రామారావు మేము ఇదివరకు ఆ సినిమా తీద్దామనుకున్నాం.. సన్యాసి వేషం, డ్యూయెట్ లేదు, ఫైట్ లేదు సినిమా ఎలా ఆడుతుంది బ్రదర్ మీరు కూడా సినిమా చేయకపోవడమే బెటర్ అని ఎన్టీఆర్ నాతో అన్నారు.

ఎలాగైనా ఆ సినిమా తీయాలనుకున్నాను. అలా పట్టుపట్టడంతో దర్శకుడు వి. రామచందర్రావు సినిమా తీయడానికి ముందుకు వచ్చారు.. కానీ ఆయన సినిమా మధ్యలో మరణించిన తాను మిగతా సినిమాని పూర్తి చేసి 1974లో విడుదల చేసాం. అని ఆ ఇంటర్వ్యూలో కృష్ణ చెప్పుకొచ్చారు. అల్లూరి సీతారామరాజు సినిమా కృష్ణ 100వ సినిమాగా విడుదలై ఆయన సినీ జీవితంలో మైలురాయిగా నిలిచింది. భారీ విజయాన్ని చవిచూసి, 19 కేంద్రాలలో 100రోజులు నడిచింది. సినిమాని ఇంక్విలాబ్ జిందాబాద్ అనే పేరుతో హిందీలోకి అనువదించారు.