Surya Kumar Yadav: కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టిన సూర్య కుమార్ యాదవ్.. ఏమైందంటే?

Surya Kumar Yadav:టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులను సృష్టించిన విషయం మనకు తెలిసిందే. ఈయన సినీ ప్రస్థానంలో అద్భుతమైన రికార్డులను సృష్టించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు.ఈయన తర్వాత ఎంతోమంది ప్లేయర్స్ తన రికార్డులను బద్దలు కొట్టాలని చూసిన కోహ్లీ రికార్డులు ఇప్పటివరకు కొన్ని భద్రంగా ఉన్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించారు. విరాట్ కోహ్లీ టీ20 సిరీస్ లో ఒకే ఏడాది ఆరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకొని రికార్డ్ సృష్టించారు. ఈ క్రమంలోని కోహ్లీ ఈ రికార్డులను సూర్య బద్దలు కొట్టారు.

రెండో టీ20లో ఆదివారం జరిగిన భారత్ న్యూజిలాండ్ మ్యాచ్లలో భాగంగా సూర్య సెంచరీతో చెలరేగిపోయాడు. గతంలో సూర్య ఎప్పుడు ఆడని విధంగా సూపర్ హిట్ షాట్లతో రెచ్చిపోయాడు. కేవలం 51 బంతులలోనే 11 ఫోర్లు7 సిక్సులు 111 పరుగులు చేసి టీమ్ ఇండియాకు భారీ విజయాన్ని అందించారు.

భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్య..
ఈ క్రమంలోనే ఆదివారం జరిగిన మ్యాచ్లో భాగంగా భారత్ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి సూర్య కుమార్ యాదవ్ కు 2022లో ఏడూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కించుకోవడంతో కోహ్లీ రికార్డును బ్రేక్ చేశారు. అయితే టి20 సీరియస్ గా భాగంగా కోహ్లీ పేరిట ఉన్నటువంటి అత్యధిక స్కోరును సూర్య బ్రేక్ చేయలేకపోయారు.ఆసియా కప్‌ 2022లో కోహ్లీ అఫ్ఘానిస్థాన్‌పై తన 71వ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 122 నా డౌట్ గా నిలిచారు అయితే సూర్య మాత్రం 111 పరుగుల వద్ద ఆగిపోవడంతో కోహ్లీ రికార్డు భద్రంగా ఉంది.