Categories: FeaturedMovie News

Senior Actor Manobala : చిరంజీవి గారు అన్నమాటకు షాక్ అయ్యాను : సీనియర్ నటుడు మనోబాల

Senior Actor Manobala : తమిళ సినిమాలలో కమెడియన్ గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సుపరిచితులైన మనోబాల గారు తెలుగులో చాలా తక్కువగా సినిమాలను చేసారు. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం బాగా తెలుసు. తమిల సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన తమిళంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయన కెరీర్ ను ప్రారంభించారు. కమల్ హాసన్ రిఫరెన్స్ తో బాలచంధర్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిన ఆయన సినిమాల్లో కమెడియన్ గా గుర్తింపు పొందారు. ఇటీవల చిరంజీవి గారితో కలిసి ఒక సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఇక చిరంజీవి గారితో ఆయన అనుభవాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు మనోబాల.

అలా మెగాస్టార్ అనేసరికి షాక్ అయ్యాను…

పున్నమినాగు సినిమాలో నటించిన మనోబాల గారు మళ్ళీ మధ్యలో కొన్ని తెలుగు సినిమాలలో నటించినా ప్రస్తుతం చిరంజీవి గారి సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవి గారితో సినిమా అవ్వడంతో అలనాటి హీరోయిన్ సుహాసిని మణిరత్నం స్వయంగా చిరుకి ఫోన్ చేసి మనోబాలను బాగా చూసుకోమని చెప్పారట. దానికి చిరు నాకు తెలుసు పెట్టెయ్ అని చెప్పి షూటింగ్ లో కొన్ని సీన్స్ అయ్యాక చాలా బాగా చేస్తున్నారు ఈ సినిమా తరువాత చూడండి మన కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది, ఇక తెలుగులో మీరు చాలా సినిమాలను చేస్తారు అంటూ చెప్పారట.

ఇప్పటికీ ఆయనలో అంతే ఎనర్జీ ఉంది అలాగే ఉన్నారు అంటూ చిరంజీవి గారి గురించి చెబుతూ ఆయన అలా అనే సరికి షాక్ అయ్యాను. అంతటి సూపర్ స్టార్ అలా నన్ను మాట్లాడేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అంటూ చెప్పారు. ఇక సెట్ లో ప్రతి ఒక్కరు చాలా మర్యాదగా మాట్లాడుతూ జాగర్తగా చూసుకున్నారని తెలుగు ఇండస్ట్రీ మర్యాద ఇవ్వడంలో సూపర్ అంటూ చెప్పారు. ఆయన నటించిన ఏ భాష చిత్రమైనా ఆయనే డబ్బింగ్ చెప్పుకుంటారు మనోబాల.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago