కూతురు గదిలోకి వెళ్లి షాకైన తల్లి.. అసలేం జరిగిందంటే..?

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో చోటు చేసుకున్న ఒక ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంట్లోని కూతురు గదిలోకి వెళ్లిన తల్లి వందల సంఖ్యలో సాలీడులను చూసి ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఏది పని మీద కూతురు గదిలోకి వెళ్లిన మహిళకు అక్కడ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. గదిలోని ఏ మూల చూసినా పుట్టలుపుట్టలుగా సాలె పురుగులు ఉండటంతో ఆ మహిళ తీవ్ర భయాందోళనకు గురైంది.

పూర్తి వివరాల్లోకి వెళితే పెటీ ఆర్ అనే ఒక మహిళ సిడ్నీలోని ఒక ఇంట్లో జీవనం సాగించేది. ఒకరోజు పెటీ ఆర్ కూతురు గదిని శుభ్రం చేయాలని అనుకొని గదిలోకి వెళ్లగా డోర్ తీసిన వెంటనే గోడపై వందల సంఖ్యలో సాలె పురుగులు కనిపించాయి. అవి ఎక్కువ సంఖ్యలో ఉండటంతో అవాక్కైన మహిళ వెంటనే ఆ విషయాన్ని తన స్నేహితురాలికి తెలియజేసింది. ఆ తరువాత మహిళ, ఆమె స్నేహితురాలు ఆ సాలె పురుగులను ఇంటి నుంచి బయటకు పంపే ప్రయత్నం చేశరు.

సాలె పురుగులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అర చేయి సైజులో ఉండే ఈ సాలె పురుగులను హంట్స్‌మన్ సాలె పురుగులని పిలుస్తారని తెలుస్తోంది. ఈ సాలె పురుగులు కరిస్తే వాంతులు, తలనొప్పి లాంటి ఆరోగ్య సమస్యలతో పాటు కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు అపాయం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే మొదట మహిళ ఫోటోలను షేర్ చేయగా చాలామంది ఆ ఫోటోలను ఫోటో షాప్ లో ఎడిట్ చేశారని కామెంట్లు చేశారు.

దీంతో సదరు మహిళ వీడియో పోస్ట్ చేసి ఆ ఫోటోలు రియల్ ఫోటోలేనని మార్ఫింగ్ ఫోటోలు కాదని ప్రూవ్ చేసింది. ఈ సాలె పురుగులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.