అదృష్టం ఎవరిని ఎప్పుడు ఏ విధంగా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. అదృష్టం వల్ల ఓవర్ నైట్ లో కోటీశ్వరులైన వారి గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. అదే విధంగా ఒక వ్యక్తి కూడా రాత్రి జింకను ఢీ కొట్టి ఉదయానికి కోటీశ్వరుడు అయ్యాడు. వినడానికి వింతగా అనిపించిన ఈ ఘటన అమెరికాలోని నార్త్ కరోలినాలో చోటు చేసుకుంది. కొత్త కారుతో జింకను ఢీ కొట్టిన వ్యక్తికి లాటరీ తగలడంతో అతని జీవితమే మారిపోయింది.
నార్త్ కరోలినాకు చెందిన ఆంటోనీ డోవ్ కొన్ని రోజుల క్రితం కొత్త కారును కొనుగోలు చేశారు. కారులో వేగంగా వెళుతున్న సమయంలో ఆంటోని వెళుతున్న రోడ్డుపైకి జింకలు వచ్చాయి. అప్పటికే కారు వేగంగా వెళుతూ ఉండటంతో ఆంటోనీ కారును కంట్రోల్ చేయలేకపోయాడు. జింకలను ఢీ కొట్టిన సమయంలో కొత్త కారు డ్యామేజ్ అయింది. కారు బాగా డ్యామేజ్ కావడం, జింకకు గాయాలు కావడంతో ఆంటోని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.
ఇంటికి వెళ్లి కారు గురించే ఆలోచిస్తూ నిద్రపోయాడు. ఉదయం లేచిన వెంటనే అతనికి తను కొనుగోలు చేసిన టికెట్ కు లాటరీ తగిలిందని తెలిసింది. లాటరీ ద్వారా ఆంటోనీ 1 మిలియన్ డాలర్లు గెలుచుకోగా ఆ ప్రైజ్ మనీ తీసుకోవడానికి వెళ్లిన సమయంలో ఆంటోనీ మరో టికెట్ ను కూడా కొనుగోలు చేశాడు. ఆ టికెట్ కు కూడా ఫ్రైజ్ మనీ రావడంతో ఏకంగా 2 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 14.6 కోట్లు) అతని సొంతమయ్యాయి.
లాటరీ డబ్బుల్లో పన్నులు పోగా అతని చేతికి 10.2 కోట్ల రూపాయలు వచ్చాయి. నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ ఈ విషయాలను వెల్లడించింది. లాటరీ ద్వారా వచ్చిన డబ్బులతో ఆంటోనీ తన కొత్త కారును రిపేర్ చేయించుకోవడంతో పాటు తన పేరెంట్స్ ఇంటికి మరమ్మత్తులు చేయిస్తానని తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…