Tag Archives: అలీ ఖాన్

Actress Kajol: తన భర్త లేనప్పుడు నా క్రష్ కాజోల్ ని లిప్ కిస్ చేశా.. తను థాంక్యూ డార్లింగ్ అని చెప్పింది : నటుడు ఆలీఖాన్

Actress Kajol: బాలీవుడ్ నటి కాజోల్ త్రిభంగ సినిమాతో డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. ఇలా డిజిటల్ మీడియాలోకి ఎంట్రీ అయ్యి ఈమె వరుస వెబ్ సిరీస్ లలో నటిస్తున్నారు. అదేవిధంగా ద గుడ్ వైఫ్ అని ఒక ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ను రీమేక్ చేస్తున్నారు. ఇక ఇందులో బ్రిటిష్ పాక్ నటుడు అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా ఒక పాడ్ కాస్ట్ లో అలీ మాట్లాడుతూ తాను నటి కాజోల్ కుపెద్ద అభిమానిని తెలిపారు గత మూడు దశాబ్దాలుగా ఆమెను వెండితెరపై చూస్తూ పెరిగానని చివరికి ఆమెతో ఇలా నటించే అవకాశం రావడం తన అదృష్టం అని తెలిపారు. ఈ వెబ్ సిరీస్ లో తాను ఆమెకు ప్రియుడుగా నటించానని తెలియజేశారు.

ఇక ఈ వెబ్ సిరీస్ లో భాగంగా ఒక సన్నివేశంలో భాగంగా తనకు ఫ్రెంచ్ కిస్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఈ షూటింగ్ ముంబైలోని ఒక లగ్జరీ హోటల్లో జరుగుతుందని, ఈ వెబ్ సిరీస్ అజయ్ దేవగన్ బ్యానర్లో నిర్మితమైనప్పటికీ ఆరోజు మాత్రం షూటింగ్ లొకేషన్లోకి అజయ్ దేవగన్ రాలేదని ఆలీ తెలిపారు. ఇలా ఈ సన్నివేశం షూటింగ్ చేసే ముందు తాను బబుల్ గమ్ తిన్నానని అయితే సింగిల్ టేక్ లోనే షూటింగ్ పూర్తి అయిందని అలీ తెలిపారు.


Actress Kajol: మూడుసార్లు ప్రాక్టీస్ చేశాను…

ఇక ఈ షూటింగ్ ప్రారంభించక ముందు మూడుసార్లు ప్రాక్టీస్ చేశానని, సింగిల్ టేక్ లో ఫ్రెంచ్ కిస్ సన్నివేశం పూర్తి కావడంతో కాజోల్ ఇలా తొందరగా ఈ సన్నివేశాన్ని పూర్తి చేసినందుకు థాంక్యూ డార్లింగ్ అంటూ తనని మెచ్చుకున్నారని ఈ సందర్భంగా నటుడు ఫ్రెంచ్ కిస్ గురించి చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.