Tag Archives: హైదరాబాద్లో

Shiva Jyothi: గృహప్రవేశానికి ముందే ఇల్లు కూలిపోయింది… ఆవేదన వ్యక్తం చేసిన శివ జ్యోతి!

Shiva Jyothi: శివ జ్యోతి తీన్మార్ వార్తలు, బిగ్ బాస్ కంటెస్టెంట్ గా, జ్యోతక్క అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమయ్యారు. తీన్మార్ వార్తలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివ జ్యోతి అనంతరం బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లారు బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం జ్యోతక్క అనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు.

ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇక తన భర్తతో కలిసి హైదరాబాద్లో నివసిస్తున్న శివ జ్యోతి హైదరాబాద్లో సొంత ఇల్లు ఖరీదైన కారు కొనుగోలు చేశారు. ఇక అత్తవారి కోసం ఒక అందమైన ఇంటిని నిర్మించాలని భావించిన ఈమె ఇంటి నిర్మాణం చేపట్టింది.

ఇలా ఆ ఇంటి పూజా కార్యక్రమాలకు,నిర్మాణానికి సంబంధించిన వీడియోలను కూడా తన యూట్యూబ్ ద్వారా షేర్ చేశారు. అయితే ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే కూలిపోయిందంటూ ఈమె మరొక వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన అనంతరం ఇంటీరియర్ డిజైన్ చేయించారు.

Shiva Jyothi:ఊడిపోయే స్థితిలో సీలింగ్…

ఇంటీరియర్ డిజైన్ పూర్తిగా ఫెయిల్ అయిందని ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంటి సీలింగ్ అప్పుడే ఊడిపోయే పరిస్థితికి వచ్చిందని అలాగే తలుపులకు బాత్రూం డోర్లకు పిల్లలు ఆడుకునే స్టిక్కర్లు అతికించారంటూ ఈమె మండిపడ్డారు. ఇలా గృహప్రవేశం కాకుండానే ఇల్లు పూర్తిగా డామేజ్ అయిందంటూ శివ జ్యోతి ఈ వీడియో ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రస్తుతం శివ జ్యోతి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ మొత్తం ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

Kaikala Satyanarayana: ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తుది శ్వాస విడిచారు.ఇలా ఈయన మరణ వార్త తెలుసుకున్న టువంటి చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఈయన మృతికి సంతాపం తెలిపింది. ఇక కైకాల సత్యనారాయణ మరణించడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఆయనతో వారికి ఉన్నటువంటి అనుబంధం గురించి గుర్తు చేసుకుంటున్నారు.

ఇలా కైకాల సత్యనారాయణ ఆరు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో 777 సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈయన చిత్ర పరిశ్రమలో నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలకు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.ఇలా ఆరు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగిన కైకాల సత్యనారాయణ ఎంత మొత్తంలో ఆస్తులు సంపాదించారు ఏంటి అనే విషయానికి వస్తే…

సినిమానే శ్వాసగా బతికినటువంటి కైకాల సత్యనారాయణ ఆస్తులను పెద్దగా కూడా పెట్టలేదని తెలుస్తుంది. కైకాల గారికి హైదరాబాద్లో నాగార్జున రెసిడెన్సీ గచ్చిబౌలిలో గల ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటి ధర సుమారు 1.5కోట్ల రూపాయల విలువ చేస్తుందని సమాచారం. అలాగే బెంగళూరులో కూడా ఒక ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది.

Kaikala Satyanarayana: వైద్య ఖర్చుల కోసం సహాయం చేసిన ఏపీ ప్రభుత్వం…

ఇది మాత్రమే కాకుండా ఈయన దగ్గర రెండు ఖరీదైన కార్లు ఉన్నాయని వీటి విలువ కూడా సుమారు కోటి రూపాయలు ఉంటుందని సమాచారం. ఇది తప్ప కైకాల గారికి పెద్దగా ఆస్తులు ఏవి లేవని తెలుస్తోంది. ఇక ఈయనకు నలుగురు సంతానం కాగా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వీరంతా కూడా వారి జీవితంలో బాగా సెటిల్ అయ్యారని తెలుస్తోంది.ఇకపోతే ఈయన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసిన విషయం కూడా మనకు తెలిసిందే.