Kaikala Satyanarayana: ప్రముఖ సినీ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తుది శ్వాస విడిచారు.ఇలా ఈయన మరణ వార్త తెలుసుకున్న టువంటి చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఈయన మృతికి సంతాపం తెలిపింది. ఇక కైకాల సత్యనారాయణ మరణించడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఆయనతో వారికి ఉన్నటువంటి అనుబంధం గురించి గుర్తు చేసుకుంటున్నారు.
ఇలా కైకాల సత్యనారాయణ ఆరు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో 777 సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈయన చిత్ర పరిశ్రమలో నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలకు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.ఇలా ఆరు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగిన కైకాల సత్యనారాయణ ఎంత మొత్తంలో ఆస్తులు సంపాదించారు ఏంటి అనే విషయానికి వస్తే…
సినిమానే శ్వాసగా బతికినటువంటి కైకాల సత్యనారాయణ ఆస్తులను పెద్దగా కూడా పెట్టలేదని తెలుస్తుంది. కైకాల గారికి హైదరాబాద్లో నాగార్జున రెసిడెన్సీ గచ్చిబౌలిలో గల ఒక అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. ఈ ఇంటి ధర సుమారు 1.5కోట్ల రూపాయల విలువ చేస్తుందని సమాచారం. అలాగే బెంగళూరులో కూడా ఒక ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది మాత్రమే కాకుండా ఈయన దగ్గర రెండు ఖరీదైన కార్లు ఉన్నాయని వీటి విలువ కూడా సుమారు కోటి రూపాయలు ఉంటుందని సమాచారం. ఇది తప్ప కైకాల గారికి పెద్దగా ఆస్తులు ఏవి లేవని తెలుస్తోంది. ఇక ఈయనకు నలుగురు సంతానం కాగా ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వీరంతా కూడా వారి జీవితంలో బాగా సెటిల్ అయ్యారని తెలుస్తోంది.ఇకపోతే ఈయన తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసిన విషయం కూడా మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…