Featured

Chalapati rao : టాలీవుడ్ లో మరో విషాదం..! గుండెపోటుతో సీనియర్ నటుడు చలపతితావు కన్నుమూత..!

Chalapati rao :తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది వర్ష విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు అనారోగ్య సమస్యల కారణంగా మరణించడంతో ఇండస్ట్రలో విషాద ఛాయలు అలముకున్నాయి. కృష్ణంరాజు, కృష్ణ, మొన్న నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతిని మరువక ముందే.. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చలపతిరావు (79) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

తెలుగు సినిమాలలో మొదట్లో విలన్ గాను ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఎన్నో సినిమాల్లో చేసిన చలపతిరావు గారు అటు స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి నేటి తరం జూ.ఎన్టిఆర్ వరకు మూడుతరాల హీరోలతో కలిసి నటించారు. 1966లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన చలపతి రావు అప్పటినుంచి దాదాపు 1200లకు పైగా సినిమాల్లో పలు విభిన్న పాత్రల్లో నటించారు.

కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు ఆయన స్వస్తలం. తండ్రి మణియ్య. తల్లి వియ్యమ్మ. 1944 మే 8న చలపతిరావు పుట్టారు. చలపతి రావు గారి కుటుంబం వ్యవసాయిక కుటుంబం. నాటకాలు, సినిమాల మీద మక్కువతో చలపతి రావు గారు సినిమాల్లోకి వచ్చారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు.. ఆయన తనయుడు రవి బాబు కూడా సినిమా ఇండస్ట్రీలోనే డైరెక్టర్ గా స్థిరపడ్డారు. ఇలా ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన సేవలను చేసినటువంటి చలపతిరావు మరణ వార్త తెలుసుకున్నటువంటి సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago