Tag Archives: 2021

పోటీ పరీక్షలకు ఫ్రీగా ట్రైనింగ్ పొందే ఛాన్స్.. ఎలా అంటే..?

దేశంలో కోట్ల సంఖ్యలో నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం కోసం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటున్నారు. మరి కొంతమంది మాత్రం ఇంటి నుంచే ఉద్యోగాల కొరకు శిక్షణ తీసుకుంటున్నారు. పేదరికం, ఆర్థిక సమస్యల వల్ల సరైన శిక్షణ పొందలేని వారికి విజేత స్టడీ సర్కిల్‌ శుభవార్త చెప్పింది.

దిల్ సుఖ్ నగర్ బ్రాంచ్ లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు డైరెక్టర్‌ వి.జె.రెడ్డి వెల్లడించారు. పోలీస్ ఉద్యోగాల కోసం టీజీటీ, పీజీటీ, ఎస్‌.ఏ, ఎస్‌జీటీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ విధంగా శిక్షణ పొందవచ్చు. సంవత్సర ఆదాయం 2 లక్షల రూపాయల లోపు ఉన్న అభ్యర్థులు శిక్షణ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎంతమంది విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తారనే వివరాలు తెలియాల్సి ఉంది.

ఉచితంగా శిక్షణ పొందాలనే ఆసక్తి ఉన్నవాళ్లు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోల సహాయంతో విజేత స్టడీ సర్కిల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఉచిత శిక్షణ పొందలనుకునే అభ్యర్థులు వచ్చే నెల 1వ తేదీ లోపు రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్ దగ్గర ఉన్న మెట్రో పిల్లర్‌ ఏ1531 ఎదురుగా ఉన్న స్టడీ సర్కిల్ దగ్గర పోటీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 90 రోజుల పాటు శిక్షణా తరగతులు ఉంటాయని తెలుస్తోంది. తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కూడా ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో ఉద్యోగాలు..?

ఏపీఎస్‌ఎస్‌డీసీ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. efftronics private ltd అనే సంస్థలోని 100 ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గరిష్టంగా 5 లక్షల రూపాయల 20 వేల వరకు ఈ ఉద్యోగాలకు వేతనం పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జనవరి 18వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది.

ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఉద్యోగాన్ని బట్టి వేతనంలో మార్పులు ఉంటాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్, సొల్యూషన్ సపోర్ట్ ఇంజనీర్, ఎంబెడ్ ఇంజనీర్, డేటా సైంటిస్ట్ ఉద్యోగ ఖాళీలకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. https://www.apssdc.in/home/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.apssdc.in/home/ ఈ వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

డేటా సైంటిస్ట్ ఉద్యోగాలకు బీటెక్ తో పాటు ఎంసీఏ, ఎంఎస్సీ చదివిన వాళ్లు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసి ఎంపికైన వాళ్లకు 5.2 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. ఎంబెడ్ ఇంజనీర్ ఉద్యోగాలకు బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి 3.8 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది.

సొల్యూషన్ సపోర్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు బీఎస్సీ, బీటెక్, డిప్లొమా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సంవత్సరానికి 2.2 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగాలకు బీటెక్ , ఎంఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు 3.8 లక్షల రూపాయల వేతనం లభిస్తుంది.