దేశంలో కోట్ల సంఖ్యలో నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం కోసం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటున్నారు. మరి కొంతమంది మాత్రం ఇంటి నుంచే ఉద్యోగాల కొరకు శిక్షణ తీసుకుంటున్నారు. పేదరికం, ఆర్థిక సమస్యల వల్ల సరైన శిక్షణ పొందలేని వారికి విజేత స్టడీ సర్కిల్ శుభవార్త చెప్పింది.
దిల్ సుఖ్ నగర్ బ్రాంచ్ లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు డైరెక్టర్ వి.జె.రెడ్డి వెల్లడించారు. పోలీస్ ఉద్యోగాల కోసం టీజీటీ, పీజీటీ, ఎస్.ఏ, ఎస్‌జీటీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ విధంగా శిక్షణ పొందవచ్చు. సంవత్సర ఆదాయం 2 లక్షల రూపాయల లోపు ఉన్న అభ్యర్థులు శిక్షణ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఎంతమంది విద్యార్థులకు ఉచిత శిక్షణ అందిస్తారనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఉచితంగా శిక్షణ పొందాలనే ఆసక్తి ఉన్నవాళ్లు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోల సహాయంతో విజేత స్టడీ సర్కిల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఉచిత శిక్షణ పొందలనుకునే అభ్యర్థులు వచ్చే నెల 1వ తేదీ లోపు రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ దగ్గర ఉన్న మెట్రో పిల్లర్ ఏ1531 ఎదురుగా ఉన్న స్టడీ సర్కిల్ దగ్గర పోటీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 90 రోజుల పాటు శిక్షణా తరగతులు ఉంటాయని తెలుస్తోంది. తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు కూడా ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మధ్యతరగతి ఉద్యోగులకు పెద్ద ఊరట కలిగించే మార్పులు రాబోతున్నాయనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి…
హరిహరసుతుడు అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా కేరళలోని శబరిమల ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రత్యేక ఉత్సాహంతో మారుమ్రోగుతోంది. సంవత్సరంలో కొన్ని…
మన రోజువారీ జీవితంలో చాలామందికి తేన్పులు రావడం సహజమే. కానీ కొందరిలో ఇవి ఎక్కువగా రావడం వల్ల అసౌకర్యంగా మారుతుంది.…
ఆరోగ్యంపై దృష్టి పెడుతున్న ఈ రోజుల్లో, ఆహారంలో చిన్న మార్పులే పెద్ద ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన…
ఇప్పటి వేగవంతమైన జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగం గణనీయంగా పెరిగింది. సాయంత్రం అయ్యాక సమోసా, పానీపూరీ, బర్గర్,…
ప్రస్తుతం మారుతున్న జీవనశైలిలో ఉద్యోగ సమయాలు కూడా పెద్దగా మారిపోయాయి. ఐటీ, హెల్త్‌కేర్, సర్వీస్ రంగాల్లో పని చేసే చాలా…