దేశంలో చాలామంది సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావిస్తున్నారు. అయితే పెరుగుతున్న ఖర్చుల వల్ల కొత్త ఇల్లును కొనుగోలు చేయడం అంత తేలిక కాదు. అయితే కేంద్రం మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవాళ్లకు మాత్రం అదిరిపోయే శుభవార్త చెప్పింది. సెక్షన్ 80ఈఈ కింద ఆదాయపు పన్ను చట్టం కింద కొత్తగా ఇంటిని కొనుగోలు చేసేవాళ్లకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
ఆదాయపు పన్ను చట్టం ద్వారా సెక్షన్ 24 ప్రకారం 2 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మినహాయింపుతో పాటు హోమ్ లోన్ పై చెల్లించే వడ్డీపై కూడా పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంటుంది. పూర్తిగా హోమ్ లోన్ చెల్లించే వరకు కూడా ఈ పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు మాత్రమే పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.
ఇంటి విలువ 50 లక్షల రూపాయల లోపు ఉండటంతో పాటు ఇంటి కొరకు తీసుకున్న రుణం 35 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉన్నవాళ్లు ఈ ప్రయోజనం పొందవచ్చు. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ లేదా ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఇంటిని కొనుగోలు చేసిన వాళ్లు మాత్రమే ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎవరైతే జాయింట్ లోన్ ను తీసుకుంటే ఇద్దరూ పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ రెండు ప్రయోజనాలతో పాటు కొత్తగా ఇల్లు కొనుగోలు చేసేవాళ్లు మరో బెనిఫిట్ కూడా పొందే అవకాశం ఉంటుంది. సెక్షన్ 80ఈఈ కింద ఈ స్కీమ్ ద్వారా 50 వేల రూపాయల వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఇంటి కొనుగోలుదారులు ఈ విధంగా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…