Categories: FeaturedGeneral News

అమ్మఒడి స్కీమ్ డబ్బులు ఇప్పటికీ జమ కాలేదా.. చేయాల్సిన పని ఇదే..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అమలు చేస్తున్న స్కీమ్ లలో అమ్మఒడి స్కీమ్ కూడా ఒకటి. గతేడాది ఈ స్కీమ్ ద్వారా 15,000 రూపాయలు అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలలో జమ చేసిన జగన్ సర్కార్ ఈ ఏడాది 14,000 రూపాయలు జమ చేసింది. ఈ నెల 11వ తేదీన అర్హులైన విద్యార్థులు తల్లుల ఖాతాలలో నగదు జమైంది. జగన్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ స్కీమ్ అమలు కోసం ఏకంగా 6,673 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.

44 లక్షల 48 వేల మంది విద్యార్థులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందారు. అయితే అన్ని అర్హతలు ఉన్నా కొంతమంది విద్యార్థుల తల్లుల ఖాతాలలో ఈ స్కీమ్ నగదు జమ కాలేదు. నగదు జమ కాకపోవడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. అయితే జగన్ సర్కార్ స్కీమ్ కు అర్హులై నగదు జమ కాని వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. స్పందన హెల్ప్ లైన్ ద్వారా అమ్మఒడి స్కీమ్ కు అర్హత పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.

1902 నంబర్ కు ఫోన్ చేయడం ద్వారా అమ్మ ఒడి స్కీమ్ కు అర్హులైన వారు పొందుపరిచిన వివరాల్లో ఏ వివరాలైనా తప్పుగా నమోదై ఉంటే ఆ వివరాలను సరి చేసుకునే అవకాశం ఉంటుంది. హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయడం గురించి అవగాహన లేని వారు గ్రామ వాలంటీర్ లేదా గ్రామ సచివాలయం ద్వారా అమ్మఒడి స్కీమ్ వివరాలను సరి పోల్చుకుని ఈ స్కీమ్ కు అర్హత పొందవచ్చు.

విద్యార్థి ఐడీ నంబర్, విద్యార్థి ఆధార్ నంబర్, పాఠశాల డిస్ట్రిక్ట్ కోడ్ నంబర్, తల్లి లేదా సంరక్షకుని ఆధార్ కార్డ్ నంబర్, బ్యాంకు అకౌంట్ నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, ఫోన్ నంబర్ వివరాలను ఇవ్వడం ద్వారా ఈ స్కీమ్ కు అర్హత పొందవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago